నటుడు సప్తగిరి చేసిన ఈ పనికి నెటిజన్ల ప్రశంసలు...ఏం చేసాడంటే?

ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఎన్నో మంది కుటుంబాలలో విషాదాలను నింపుతోంది.అయితే ఇది ఒక్క సామాన్యులనే కబలిస్తుందనుకుంటే పొరపాటు.

 Actor Saptagiri To Stand Behalf Of Writer Nandyala Ravi Who Died Of Corona-TeluguStop.com

ఇది ఒక్క రంగం అని కాదు అన్ని రకాల రంగాలలోని వ్యక్తులను కబలిస్తోంది.ఇక ఎన్నో కుటుంబాలు ఇంటి పెద్దను, ఎదిగిన కొడుకులను కోల్పోయి గర్భశోకంతో విలవిలాలాడుతున్న పరిస్థితి ఉంది.

అయితే ఇప్పుడు వినాశక కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయిన తమ సన్నిహిత కుటుంబాలకు ఏదో ఒక రూపంలో అండగా ఉంటూ కొంత బాసటగా నిలుస్తున్నారు.ఇప్పటికే ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ తన కీబోర్డ్ ప్లేయర్ అయిన కమల్ కుమార్ కరోనా బారిన పడి మరణించడంతో అతనిది నిరుపేద కుటుంబం కావడంతో.

 Actor Saptagiri To Stand Behalf Of Writer Nandyala Ravi Who Died Of Corona-నటుడు సప్తగిరి చేసిన ఈ పనికి నెటిజన్ల ప్రశంసలు…ఏం చేసాడంటే-Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కుటుంబానికి కొంత ఆర్థికంగా అండగా నిలబడడమే కాకుండా, తన కొడుకును సైతం చదివించడానికి ముందుకొచ్చిన పరిస్థితి ఉంది.అయితే తాజాగా ఈ జాబితాలో నటుడు సప్తగిరి కూడా చేరడం విశేషం.

ప్రముఖ రచయిత నంద్యాల రవి కోవిడ్ తో బాధపడి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందినా విధి వక్రించడంతో మరణించడం జరిగింది.అయితే రచయిత నంద్యాల రవి కుటుంబానికి నటుడు సప్తగిరి అండగా నిలిచి మానవత్వం చాటుకున్నాడు.

నంద్యాల రవి కుటుంబానికి లక్ష రూపాయలను సహాయం చేసి ఆర్థికంగా అండగా నిలిచాడు.ఇంతటి గొప్ప పని చేసిన సప్తగిరిని నెటిజన్లు అభినందిస్తున్నారు.

#Actor Saptagiri #Nandyala Ravi #Died Of Corona #ViralNews #Ss Taman

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు