ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.శ్వాస సంబంధిత వ్యాధి సమస్య, ఛాతీలో నొప్పి రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.
అయితే ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చిందేమోనని వైద్యులు పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని నిర్ధారణ అయింది.అయినా శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో కరోనా వచ్చే ప్రమాదం ఉండవచ్చని కొన్ని రోజుల పాటు వైద్యుల పరిశీలనలో ఉంచారు.
నటుడు సంజయ్ దత్ కు కొద్ది రోజులుగా శ్వాస సంబంధమైన సమస్య, ఛాతీలో నొప్పి వచ్చింది.దీంతో అతడిని కుటుంబ సభ్యులు ముంబయిలోని లీలావతి ఆస్పత్రిలో జాయిన్ చేయించారు.
డాక్టర్లు కరోనా వచ్చిందని అనుమానంతో పరీక్షలు కూడా నిర్వహించారు.రిపోర్టుల్లో నెగిటివ్ అని రావడంతో కొద్ది రోజుల పాటు పరిశీలనలో ఉంచారు.
ప్రస్తుతం సంజయ్ దత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.నాన్ కోవిడ్ వార్డులో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు లీలావతి ఆస్పత్రి వైద్య సిబ్బంది వెల్లడించారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో సంజయ్ కు కరోనా పాజిటివ్ వస్తుందేమోనని, అందుకే కొద్ది రోజుల పాటు పరిశీలన ఉంచారని పలువురు ఆరోపిస్తున్నారు.ప్రస్తుతం హిరో సంజయ్ దత్ కేజీఎఫ్-2 సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారని అందరికీ తెలిసిన విషయమే.