సర్కారు షూట్ లో అడుగుపెట్టిన స్టార్ నటుడు!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రెసెంట్ పరశురామ్ పెట్ల దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.ఈ మధ్యనే మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి టీజర్ విడుదల అయ్యింది.

 Actor Samuthirakani Joins In Sarkaru Vaari Paata Shoot,mahesh Babu, Keerthy Sure-TeluguStop.com

మహేష్ ఈ సినిమాలో మరింత యంగ్ గా కనిపిస్తున్నాడు.అంతేకాదు ఈ టీజర్ చూస్తేనే అర్ధం అవుతుంది మహేష్ రోల్ ఎంత ఎనర్జిటిక్ గా ఉందొ.

ఈ సినిమాలో మహేష్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు.ఈ సినిమాలో బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న అవినీతి, మోసాలు గురించి చూపించ బోతున్నారని తెలుస్తుంది.

ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంకు మేనేజర్ కొడుకుగా నటిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపు కుంటుంది.

Telugu Keerthy Suresh, Mahesh Babu, Parasuram, Samuthirakani, Sarkaruvaari-Movie

ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఇక ఈ సినిమా నుండి మరొక అప్డేట్ వచ్చింది.ఈ సినిమాలో తమిళ స్టార్ నటుడు సముద్రఖని కూడా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.మరి ప్రెసెంట్ సర్కారు వారి పాట సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది.

Telugu Keerthy Suresh, Mahesh Babu, Parasuram, Samuthirakani, Sarkaruvaari-Movie

తాజాగా ఈ సినిమా షూట్ లో సముద్రఖని కూడా పాల్గొన్నట్టు తెలుస్తుంది.నిన్నటి నుండి సర్కారు షూట్ లో పాల్గొంటున్న సముద్రఖని పై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.ఈ సినిమా 2021 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమా షూట్ పూర్తి అయినా వెంటనే మహేష్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube