మాటల మాంత్రికుడికి నటుడు సంపత్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరిగిందంటే?

కొరటాల దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన విలన్ సంపత్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇలా తెలుగులో మొదటి సినిమాతోనే ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని కరుడుగట్టిన విలన్ మాదిరి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్న సంపత్ రాజ్ ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.

 Actor Sampath Raj Warning To Trivikram Sampath Raj, Trivikram, Sampath Raj Warning, Tollywood, Alitho Saradga-TeluguStop.com

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్న సంపత్ రాజ్ తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

ఈ సందర్భంగా ఆలీతో ఎన్నో విషయాలను ముచ్చటించిన సంపత్ రాజ్ ను అలీ ఎన్నో రకాల ప్రశ్నలు వేశారు.ఈ క్రమంలోనే అలీ మాట్లాడుతూ నెక్స్ట్ సినిమాలో తనకు అవకాశం ఇవ్వకపోతే లొకేషన్ కి వచ్చి కెమెరాలు ఎత్తుకెళ్లి పోతాను అని వార్నింగ్ ఇచ్చారు అంట కదా అని ప్రశ్నించగా అవును అంటూ డైరెక్టర్ పేరు మనకు వినిపించకుండా చేశారు.

 Actor Sampath Raj Warning To Trivikram Sampath Raj, Trivikram, Sampath Raj Warning, Tollywood, Alitho Saradga-మాటల మాంత్రికుడికి నటుడు సంపత్ స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తరువాత వీరి మాటలను బట్టి చూస్తే అది త్రివిక్రమ్ అని అర్థమవుతోంది.

ఈ సందర్భంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దగ్గరకు వెళ్లి ఏదో కొత్త సినిమా చేస్తున్నావంట కదా నాకు చాన్స్ ఇవ్వకపోతే కెమెరాలను ఎత్తుకెళ్తానని తనకు వార్నింగ్ ఇచ్చినట్లు సంపత్ రాజ్ తెలిపారు.ఇక ఈ విషయంపై అలీ మాట్లాడుతూ ఆయన ఈసారి కెమెరాలు లేకుండా సినిమా చేస్తారంట అని చెప్పారు.అయితే ఎఫ్ 3 సినిమా షూటింగ్ జరిగే సమయంలో సునీల్ చెబుతూ త్రివిక్రమ్ ఎక్కడ ఉంటారో నేను మీకు చెప్పను కానీ సాయంత్రం అయ్యే సరికి ఆయన అక్కడ ఆఫీస్ లో ఉంటారు వెళ్ళి కలవండి అంటూ తనకు సలహా ఇచ్చారని సంపత్ రాజ్ తెలిపారు.

అయితే నెక్స్ట్ అతనిని మీరు అటాక్ చేయబోతున్నారా అని అలీ అడగడంతో 100% ఎటాక్ చేస్తానని సంపత్ రాజ్ తెలిపారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube