నటి శరణ్య నా మాజీ భార్య కాదు.. షాకింగ్ నిజాన్ని బయటపెట్టిన సంపత్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంది పేరు మోసిన విలన్స్ ఉన్నారు.అలాంటి వారిలో విలన్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్నటువంటి నటుడు సంపత్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Actor Sampath Raj In Alitho Saradaga Latest Episode Promo, Actor Sampath, Alitho Saradaga, Sharanya, Viral Video-TeluguStop.com

మిర్చి సినిమా ద్వారా విలన్ గా అందరికీ సుపరిచితమైన సంపత్ నంది అనంతరం శ్రీమంతుడు, రన్ రాజా రన్, దమ్ము వంటి ఎన్నో చిత్రాలలో విలన్ పాత్రలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.విలన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న సంపత్ ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ క్రమంలోనే సంపత్ రాజ్ ఎంటర్ అవ్వగానే మిర్చి మిర్చి పాటకు అలీతో కలిసి స్టెప్పులు వేశారు.ఇలా డాన్స్ వేసిన అనంతరం ఇకపై ఐటమ్ సాంగ్స్ వేయాలంటే ఆడ వాళ్లను మాత్రమే కాదు మిమ్మల్ని కూడా తీసుకుంటారని అలీ మాట్లాడటంతో దయచేసి మీరు రెక మెండ్ చేయండి నేను ఇలాంటి ఐటమ్ సాంగ్స్ లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

 Actor Sampath Raj In Alitho Saradaga Latest Episode Promo, Actor Sampath, Alitho Saradaga, Sharanya, Viral Video-నటి శరణ్య నా మాజీ భార్య కాదు.. షాకింగ్ నిజాన్ని బయటపెట్టిన సంపత్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ కార్యక్రమంలో భాగంగా అలీతో కలిసి ఎన్నో విషయాలను ముచ్చటించిన ఆయన తన గురించి సీనియర్ నటి శరణ్య గురించి గతంలో వచ్చిన వార్తల గురించి క్లారిటీ ఇచ్చారు.

సీనియర్ నటి శరణ్య ఫ్యామిలీ, తనకు బాగా క్లోజ్ అని మేమంతా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనే విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు.నటి శరణ్యతో కలిసి ఎన్నో సినిమాలలో భార్యాభర్తల పాత్రలలో నటించాము.ఈ క్రమంలోనే కొందరు మా ఇద్దరి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తను నా మాజీ భార్య అంటూ వార్తలు సృష్టించారని తెలిపారు.

నటి శరణ్య భర్త, నేను మంచి స్నేహితులని ఈ విధంగా వచ్చే వార్తల గురించి ఎలా స్పందించాలో తెలియడం లేదు అంటూ తన గురించి శరణ్య గురించి వస్తున్న వార్తలపై సంపత్ రాజ్ ఈ కార్యక్రమం ద్వారా క్లారిటీ ఇచ్చారు.ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube