Sameer Chiranjeevi : చిరంజీవికి చెప్పినా ఉపయోగం లేదన్న సమీర్.. ఆయనకు కూడా ఇవ్వలేదంటూ?

ప్రముఖ నటుడు సమీర్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ కు నాకు గ్యాప్ లేదని తెలిపారు.ఎవరూ కావాలని దూరం పెట్టరని ఆయన కామెంట్లు చేశారు.

 Actor Sameer Shocking Comments About Indra Movie Shield Details Viral ,  Sameer-TeluguStop.com

నెక్స్ట్ డే మార్నింగ్ షూట్ లేదంటే నైట్ లైఫ్ కు నేను ప్రాధాన్యత ఇస్తానని ఆయన పేర్కొన్నారు.షూట్ ఉంటే ఆ షూట్ ప్రాధాన్యత దానికి ఉంటుందని సమీర్ వెల్లడించారు.

సాంప్రదాయం అనే సినిమాలో నాకు ఛాన్స్ వచ్చిందని ఆయన పేర్కొన్నారు.

ఆ సమాచారం నాకు అలస్యంగా తెలియడంతో ఆ సినిమాలో నటించే ఛాన్స్ మిస్ అయిందని సమీర్ చెప్పుకొచ్చారు.

శుభ సంకల్పం సినిమా ఫంక్షన్ కు నేను వెళ్లినా గేటు దగ్గర సెక్యూరిటీ లోపలికి పంపించలేదని ఆయన అన్నారు.ఈ విషయం నేను ఎక్కడా చెప్పలేదని సమీర్ అన్నారు.

ఆ సినిమా షీల్డ్ తీసుకుని ఉంటే బాగుండేదని ఆయన పేర్కొన్నారు.శుభ సంకల్పం సినిమాకు బాలుగారు ప్రొడ్యూసర్ అని సమీర్ చెప్పుకొచ్చారు.

Telugu Chiranjeevi, Indra, Ntr, Raghu Kunche, Sameer-Movie

ఆ షీల్డ్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందని తెలిపారు. ఇంద్ర సినిమా ఫంక్షన్ కోదాడలో జరిగిందని ఆ సినిమాలో నటనకు చిరంజీవి గారి చేత స్టేజ్ పై షీల్డ్ ఇచ్చారని ఆ తర్వాత ఇళ్లకు షీల్డ్ లు పంపిస్తామని చెప్పారని కానీ పంపించలేదని సమీర్ పేర్కొన్నారు.ఆ సమయంలో రఘు కుంచె ఆ షీల్డ్ లూ వాళ్ల దగ్గర నుంచి రావు అని చెప్పారని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Chiranjeevi, Indra, Ntr, Raghu Kunche, Sameer-Movie

ఈ విషయం గురించి చిరంజీవికి చెబితే ఆయన నా షీల్డ్ నా దగ్గర లేదని చెప్పారని సమీర్ తెలిపారు.అశ్వనీదత్ గారికి చెబితే ఆయన ఆఫీస్ లో తీసుకోవాలని చెప్పారని అక్కడ షీల్డ్ లేదని పేర్కొన్నారు.చిరంజీవి గారిని నేను ఇప్పటికీ ఆ షీల్డ్ గురించి అడుగుతానని సమీర్ కామెంట్లు చేయడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube