ఈ టీవీ నటుడుకు విచిత్రమైన అలవాటు.. పాములు కనిపిస్తే చేత్తోనే?

భూమిపై నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఏదో ఒక అలవాటు ఉంటుంది.ముఖ్యంగా కొందరికి కొన్ని విచిత్రమైన అలవాట్లు కూడా ఉంటాయి.

 Actor Sai Kiran Strange Habit For This Tv Actor He Use Hands To Catch The Snakes-TeluguStop.com

మామూలుగా ఒక పనిని పదేపదే చేయడమే అలవాటు అని అంటుంటారు.అందులో ఏ పనైనా అనుకోవచ్చు.

కానీ ఓ టీవీ నటుడికి నటననే కాకుండా మరో విచిత్రమైన అలవాటు ఉందట.అది పాముల విషయంలోనట.

ఇంతకీ ఆ నటుడు ఎవరంటే.

తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన నటుడు సాయి కిరణ్.

నువ్వేకావాలి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయయ్యాడు.ఈయన తండ్రి నేపథ్య గాయకుడైనా రామకృష్ణ.

ఆ తర్వాత ప్రేమించు సినిమాలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.అలా వరుసగా పలు సినిమాలలో నటించిన కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.

వెండి తెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పలు సీరియల్స్ లో నటించాడు.వెండితెరపై అందుకొని సక్సెస్ ను బుల్లితెరపై అందుకున్నాడు.ఇక ఈ బుల్లితెర పై శివలీలలు సీరియల్ లో విష్ణువు పాత్రలో నటించాడు.అంతేకాకుండా పలు సీరియళ్లలో వెంకటేశ్వరుడిగా, కృష్ణుడిగా కూడా నటించాడు.

కోకిలమ్మ సీరియల్ లో నటించగా ఈ సీరియల్ కొన్ని రోజుల కిందట పూర్తయింది.

అంతేకాకుండా అభిలాష, సుందరకాండ, ఆటో భారతి సీరియల్ లో కూడా నటించాడు.

ఇక ఈయన ఒక నటుడిగానే కాకుండా హైదరాబాద్ బ్లూ క్రాస్ సంస్థ లో చేరి జంతు సంరక్షణ బాధ్యతలు చేపట్టాడు.ఇక వేరే సంస్థలలో కూడా ఒక సభ్యుడిగా కొన్ని బాధ్యతలు చేపట్టాడు.

ఇదిలా ఉంటే ఈయనకు పాములు పట్టుకోవడం అనే ఓ అలవాటు ఉంది.

Telugu Sai Kiran, Nuvve Kavali, Nuvvekavali, Rajnikanth, Tollywood-Movie

గతంలో ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి కొన్ని విషయాలు పంచుకున్నాడు.తనకు పాములు పట్టుకోవడం హాబీ అని ఇక అప్పుడే ఒక మూడు వేల పాములు పట్టుకున్నానని తెలిపాడు.వాటిని పట్టుకొని అడవులలో వదిలి పెట్టే వాడినని తెలిపాడు.

పాములు పట్టుకోవడం తప్ప వేరే విషయంలో ఆసక్తులు లేవని అన్నారు.ఇక ఈయన ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టాడు.

ఇక తన సినిమాల గురించి కూడా కొన్ని విషయాలు పంచుకున్నాడు.సినిమాలలో నటించడం తనకు హాయిగా ఉందని ఎందుకంటే రోజుకు ఒకటే లేదా రెండు సీన్లు మాత్రమే షూట్ చేస్తారని అదే సీరియల్ అయితే రోజుకు రెండు మూడు ఎపిసోడ్లను తీయడంతో బాగా అలసిపోతామని తెలిపాడు.

కానీ టీవీ ఆర్టిస్ట్ కి ఎప్పుడు ఖాళీగా ఉండే అక్కర్లేదు చేతినిండా పని ఉంటుందని తెలిపాడు.

Telugu Sai Kiran, Nuvve Kavali, Nuvvekavali, Rajnikanth, Tollywood-Movie

తనకు నటుడిగా రజినీకాంత్ సలహా ఇచ్చాడని ఆయన చెప్పేవరకూ తనలో అంత టాలెంట్ ఉందని అనుకోలేదట.ఇక సీరియల్స్ లో కూడా తనకు నటుడిగా తృప్తి అందిస్తుందని.సీరియల్స్ ద్వారా తనకు మంచి అభిమానం ఉందని తెలిపాడు.

ఇక తన కెరీర్ లో నువ్వే కావాలి, ప్రేమించు సినిమాలు మంచి గుర్తింపు ఇచ్చిన కూడా మళ్లీ అవకాశాలు రాలేదని దానికి కారణం తనకు కూడా తెలియదని తెలిపాడు.ఇక ప్రస్తుతం ఈయన గుప్పెడంత సీరియల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube