బాలీవుడ్‌లో మరో విషాదం.. నటుడు రిషి కపూర్ కన్నుమూత

బాలీవుడ్ విలక్షణ నటుడు ఇర్ఫాన్ ఖాన్ అరుదైన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ నిన్న(బుధవారం) మృతి చెందిన విషయం నుండి ప్రజలు కోలుకోక ముందే మరో విషాదం చోటు చేసుకుంది.బాలీవుడ్ హీరో, ప్రముఖ నటుడు రిషి కపూర్(67) తాజాగా క్యాన్సర్ వ్యాధితో చికిత్స పొందుతూ ముంబైలోని ఓ ఆసుపత్రిలో మృతిచెందాడు.
గతకొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న రిషి కపూర్, బుధవారం శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు.దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ముంబైలోని రిలయన్స్ ఆసుపత్రిలో చేర్పించారు.

 Rishi Kapoor, Bobby, Cancer, Irrfan Khan, Rishi Kapoor Dead-TeluguStop.com

కాగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రిషి కపూర్, గురువారం ఉదయం కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.బాలీవుడ్‌లో కపూర్ ఫ్యామిలీలో హీరో రాజ్ కపూర్ కొడుకుగా ఎంట్రీ ఇచ్చిన రిషి కపూర్, బాబీ సినిమాతో హీరోగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.

రెండు దశాబ్దాలకు పైగా హీరోగా ప్రేక్షకుల మనసును దోచుకున్న రిషి కపూర్‌కు బిగ్ బి అమితాబ్ బచ్చన్ చాలా సన్నిహితుడిగా ఉన్నారు.వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను అలరించాయి.

రిషి కపూర్ మరణవార్తతో పలువురు సినీ ప్రముఖులు, ప్రేక్షకులు తీవ్ర సంతాపం తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube