నాకు నటన అంటే పెద్దగా ఇష్టం లేదు.. కానీ

టాలీవుడ్లో విలక్షణ నటుడు రావు రమేష్ గురించి పెద్దగా తెలియని వారుండరు.అయితే ఈయన ఒకప్పుడు తెలుగులో ఎన్నో వైవిధ్య పాత్రల్లో నటించి మెప్పించినటువంటి రావు గోపాలరావు తనయుడు అయినప్పటికీ సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి చాలా కష్టాలను ఎదుర్కొన్నాడు.

 Rao Ramesh, Actor, Tollywood, Struggules, Rao Gopal Rao, Sarileru Nikevvaru, Pra-TeluguStop.com

అయితే ప్రస్తుతం తన నటనతో వరుస అవకాశాలు దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు.ముఖ్యంగా రావు రమేష్ విలన్, అన్న, నాన్న, ఇతర పాత్రల్లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.

అయితే తాజా రావు రమేష్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూ లో పాల్గొన్నాడు.

ఇందులో భాగంగా తన సినీ జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల గురించి ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో ముఖ్యంగా తాను మొదటగా సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో నటుడు కావాలని అనుకోలేదని డైరెక్టర్ అవ్వాలని సినీ పరిశ్రమకు వచ్చానని కానీ కొన్ని అనుకోని కారణాలవల్ల దర్శకత్వం వదిలేసి నటన వైపు అడుగులేయల్సీ వచ్చిందని చెప్పుకొచ్చాడు.అలాగే తాను సీనియర్ నటుడు స్వర్గీయ రావు గోపాలరావు కొడుకునే అయినప్పటికీ అవకాశాల కోసం చాలా ఎదురు చూపులు, కష్టాలు పడ్డానని తెలిపాడు.

అంతేగాక ప్రస్తుతం వరుస అవకాశాలు దక్కించుకుంటూ సినీ పరిశ్రమకు తన తండ్రి లేని లోటు తీర్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నానని చెప్పుకొచ్చాడు.

ఇటీవల కాలంలో రావు రమేష్ సరిలేరు నీకెవ్వరు, ప్రతి రోజు పండగే అనేక చిత్రాలలో నటించాడు.

బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి.అలాగే టాలీవుడ్ కి సంబందించిన మరికొందరి స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube