ఎన్టీఆర్ ను అపరిచితుడితో పోల్చిన రాజీవ్ కనకాల..?

జూనియర్ ఎన్టీఆర్, రాజీవ్ కనకాల మధ్య స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎన్టీఅర్ నటించిన స్టూడెంట్ నంబర్ 1 సినిమా నుంచి జనతా గ్యారేజ్ వరకు చాలా సినిమాల్లో రాజీవ్ కనకాల నటించారు.

 Actor Rajiv Kanakala Sensational Comments About Junior Ntr, Aparichithudu, Jr Nt-TeluguStop.com

అయితే ఎన్టీఆర్ కు తనకు మధ్య గొడవతోనే పరిచయం మొదలైందంటూ రాజీవ్ కనకాల ఎవరికీ తెలియని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.వయస్సులో ఎన్టీఆర్ తో పోలిస్తే రాజీవ్ 14 సంవత్సరాలు పెద్దవాడు.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన స్టూడెంట్ నంబర్ 1 సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించగా రాజీవ్ కనకాల నెగిటివ్ షేడ్ ఉన్న రోల్ లో నటించారు.రాజీవ్ ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ తో పరిచయం గురించి మాట్లాడుతూ స్టూడెంట్ నంబర్ 1 సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరిగిందని ఆ సినిమా షూటింగ్ సమయంలో ఆర్టిస్ట్ శేఖర్ ఒక కళ్లజోడు తీసుకొచ్చాడని.

ఆ కళ్లజోడు తనకు నచ్చడంతో తీసిపెట్టుకున్నానని కానీ ఎన్టీఆర్ మాత్రం కళ్లజోడు గురించి కామెంట్లు చేశాడని అన్నారు.

Telugu Ntr, Rajamouli, Rajiv Kanakala, Number-Latest News - Telugu

కళ్లజోడు తీసుకున్న తరువాత ఎన్టీఆర్ “ ఛ.కళ్లజోడు అవసరమా” అని అన్నాడని.తాను అవసరమేనని ఎన్టీఆర్ కు చెప్పానని కానీ మళ్లీ ఎన్టీఆర్ కెలుకుతాడని అనిపించిందని రాజీవ్ అన్నారు.

ఆ విషయం రాజమౌళికి చెప్పానని.సినిమా నుంచి తప్పుకోవాలని అనుకున్నానని.

ఆ తరువాత రోజు మాత్రం ఎన్టీఆర్ మర్యాద ఇస్తూ గుడ్ మార్నింగ్ చెప్పాడని.ఎన్టీఆర్ అపరిచితుడని రాజీవ్ కనకాల చెప్పారు.

తరువాత రోజు ఎన్టీఆర్ మళ్లీ కెలికినా ఆ తరువాత తామిద్దరం మంచి స్నేహితులం అయ్యామని.ఆ స్నేహం ఇప్పటికీ అలాగే కొనసాగుతోందని చెప్పారు.ఎన్టీఆర్ సినిమాల్లో ఎక్కువగా కనిపించడానికి కారణం తనకు కూడా తెలీదని.కెరీర్ మొదట్లో మాత్రం తారక్ పట్టుబట్టి కొన్ని సినిమాల్లో ఛాన్స్ వచ్చేలా చేశాడని చెప్పారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube