నెటిజన్లతో కన్నీరు పెట్టిస్తున్న ఓ నటుడి మరణం.. !

ప్రస్తుతం ప్రపంచదేశాలన్ని జాలీగా చూస్తున్న దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం మాత్రమే.ఎందుకంటే అధిక జనాభ గల ఈ దేశంలో కరోనాలాంటి మహమ్మారి విసృతంగా వ్యాపిస్తే చాలా కష్టమని కరోనా ఫస్ట్ వేవ్‌లోనే ప్రపంచ ఆరోగ్య సంస్దలు హెచ్చరించాయి.

 Actor Rahul Vohra From Uttarakhand Has Passed Away With-TeluguStop.com

అయితే కోవిడ్ మొదటి వేవ్ అంతగా ప్రభావం చూపలేక పోయింది.కానీ సెకండ్ వేవ్ మాత్రం భయంకరంగా ప్రాణాలు తీస్తుంది.

మనిషిలోని ముఖ్యమైన అవయవాల మీద దాడి చేస్తూ ఊపిరాడకుండా చేస్తుంది.దీనిఫలితంగా చోటు చేసుకుంటున్న కొందరి మరణాలు అత్యంత దయనీయమైన స్దితిలో ఉంటున్నాయి.

 Actor Rahul Vohra From Uttarakhand Has Passed Away With-నెటిజన్లతో కన్నీరు పెట్టిస్తున్న ఓ నటుడి మరణం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం హోదా, రికమండేషన్, డబ్బు ఇవేవి కూడా ప్రాణాలను కాపాడలేకపోతున్నాయి.ఇకపోతే కోవిడ్ మహమ్మారి బారినపడిన ఉత్తరాఖండ్‌ కు చెందిన నటుడు రాహుల్ వోహ్రా(35) కన్నుమూశాడు.‘మళ్లీ పుడితే మంచి పనులు చేస్తా, ఇప్పటికైతే బతుకుతానన్న ఆశ లేదు’’ అంటూ అతడు సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ లు పలువురి హృదయాలను మెలితిప్పుతోంది.

ఇదేకాకుండా గతవారం ఫేస్‌బుక్‌ లో రాహుల్ ఓ పోస్టు పెడుతూ తన కోసం ఒక ఆక్సిజన్ బెడ్ కావాలంటూ సాయం కోరాడు.

రాహుల్ చేసిన ఆ పోస్టు నెటిజన్లతో కన్నీరు పెట్టిస్తుందట.కాగా డిజిటల్ ప్లాట్‌ ఫామ్‌ పై చిరపరిచితుడైన రాహుల్ కరోనా బారినపడిన తర్వాత జీవితంపై ఆశలు వదిలేసుకున్నాడు.

తనకు సరైన వైద్యం అందడం లేదని, ధైర్యం సన్నగిల్లుతోందంటూ నిన్న సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు.అంతలోనే మృత్యువు తన వొడిలోకి చేర్చుకుంది ఇక వెలుగులోకి రాని ఇలాంటి మరణాలు ఎన్నో చోటు చేసుకుంటున్నాయి.

#Uttarakhand #Actor #Corona #Passed Away #Rahul Vohra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు