హీరో మాధవన్ కొడుకు వేదాంత్ కు ఎంపీ ప్రశంస.. ఏకంగా ఏడు జాతీయ పథకాలు?

సాధారణంగా కొడుకు పుట్టినప్పుడు కాకుండా వారు ఏదైనా విజయాన్ని సాధించిన అప్పుడు ఆ తండ్రికి ఎంతో గర్వకారణంగా ఉంటుంది.ఈ క్రమంలోనే సెలబ్రిటీ పిల్లలు విషయంలో ఇలా మంచి గుర్తింపు సంపాదించుకుంటే వారి తల్లిదండ్రులకు వచ్చే ఆనందం మాటల్లో చెప్పలేనిది అని చెప్పవచ్చు.

 Actor R Madhavan Son Vedant Won Seven Medals Swimming Championship Details, Her-TeluguStop.com

ప్రస్తుతం అలాంటి ఆనందంలోనే ఉన్నారు హీరో మాధవన్. మాధవన్ కొడుకు వేదాంత్ అరుదైన రికార్డును సొంతం చేసుకోవడంతో ఈయన పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

16 సంవత్సరాల వయసు కలిగిన వేదాంత్ తాజాగా 47వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్స్ 2021లో భాగంగా వేదాంత్ ఏకంగా ఏడు జాతీయ పథకాలను సాధించడంతో మరోసారి మన దేశం పేరు మార్మోగిపోతోంది.ఈ క్రమంలోనే మాధవన్ కొడుకు వేదాంతంపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజాగా ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వీ ఓ ట్వీట్‌ చేస్తూ మాధవ్ అతని కొడుకు పై ప్రశంసలు కురిపించారు.ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ గుడ్ జాబ్ వేదాంత్.

దేశం గర్వించేలా చేసావు నిన్ను చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది అలాగే నీ పెంపకం కూడా ఎంతో బాగుంది అంటూ తన తండ్రి మాధవన్ పై ప్రశంసలు కురిపించారు.

ఈ క్రమంలోనే ఈ ట్వీట్ వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు వేదాంత్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.బెంగళూరు వేదికగా బసవనగుడి ఆక్వాటిక్ సెంటర్‌లో జరిగిన ఈ పోటీలో వేదాంత్‌ నాలుగు విరచిత పథకాలతో పాటు మూడు కాంస్య పతకాలను సాధించారు.

అయితే వేదాంత్ సాధించిన ఈ ఘనత పైపలువురు ప్రశంసలు కురిపిస్తూనే బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ను తీవ్ర విమర్శలు చేస్తున్నారు.ఇంత చిన్న వయసులోనే వేదాంత్ ఎన్నో పథకాలను సాధించడంతో తన పేరు మారుమోగిపోతుంటే షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ కార్ డ్రగ్ కేసులో అరెస్టయి సోషల్ మీడియాలో వైరల్ గా మారారు అంటూ పలువురు విమర్శలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube