కత్తి మరణం వెనుక కుట్ర ఉందా.. అనుమానాలు వ్యక్తం చేసిన పృథ్వీ?

సినీ క్రిటిక్ కత్తి మహేష్ మృతిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.నెటిజన్లలో కొంతమంది ప్రమాదవశాత్తు కత్తి మహేష్ మృతి చెందారని భావిస్తుంటే ఎక్కువమంది మాత్రం కత్తి మహేష్ మృతి వెనుక కుట్ర కోణం ఉందని భావిస్తున్నారు.

 Actor Pruthwi Raj Shocking Comments About Katti Mahesh Death , Katthi Mahesh Dea-TeluguStop.com

చాలా సందర్భాల్లో విమర్శలు, వివాదాల ద్వారా కత్తి మహేష్ వార్తల్లో నిలిచారు.ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ గురించి, ఏపీలో ఉన్న ఒక పార్టీ గురించి కత్తి మహేష్ విమర్శలు చేశారు.

ప్రముఖ టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన పృథ్వీ తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కత్తి మహేష్ గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.2019 సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాను, కత్తి మహేష్ కొన్ని ప్రాంతాల్లో ఎన్నికల కోసం ప్రచారం నిర్వహించామని పృథ్వీ వెల్లడించారు.తాను ప్రెస్ మీట్ లో బాగా మాట్లాడటానికి కత్తి మహేష్ ఎంతగానో సహాయం చేశారని పృథ్వీ చెప్పుకొచ్చారు.

Telugu Car, Critic, Friend, Kathi Mahesh, Kathimahesh, Pruthwi, Tollywood-Movie

ఏదైనా కత్తి మహేష్ ఎంచుకుంటే దానిపై బలంగా నిలబడేవారని పృథ్వీ పేర్కొన్నారు.తనపై వచ్చే ట్రోలింగ్ గురించి కత్తి మహేష్ మనం యుద్ధం చేస్తున్నామని యుద్ధం చేస్తున్న వాళ్లు కత్తి పట్టుకుని ఉండకపోతే తల తీసుకొని వెళతారని కత్తి మహేష్ చెప్పేవాడని పృథ్వీ పేర్కొన్నారు.ఏపీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో మాత్రమే కత్తి మహేష్ కు సహాయం చేసిందని పృథ్వీ అన్నారు.

Telugu Car, Critic, Friend, Kathi Mahesh, Kathimahesh, Pruthwi, Tollywood-Movie

కత్తి మహేష్ చనిపోయిన తర్వాత వచ్చిన ట్రోల్స్ తనను బాధ పెట్టాయని పృథ్వీ పేర్కొన్నారు.కత్తి మహేష్ కారు నడిపిన వ్యక్తికి ఎలాంటి గాయాలు కాలేదని అయితే కత్తి మహేష్ ప్రాణాలు మాత్రం పోయాయని పృథ్వీరాజ్ అనుమానాలు వ్యక్తం చేశారు.కత్తి మహేష్ మంచి ఫ్రెండ్ అని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు.పోలీసుల దర్యాప్తులో కత్తి మహేష్ మృతి గురించి కొత్త విషయాలు తెలుస్తాయేమో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube