నటుడు ప్రియదర్శి భార్య ఎవరో మీకు తెలుసా..?

తెలుగులో తక్కువ సమయంలోనే పాపులారిటీ సంపాదించుకున్న కమెడియన్లలో ప్రియదర్శి ఒకరనే సంగతి తెలిసిందే.ఈ మధ్య కాలంలో మల్లేశం, జాతిరత్నాలు సినిమాలలోని పాత్రలను అద్భుతంగా పోషించి ప్రియదర్శి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడంతో పాటు ఫ్యాన్ ఫాలోయింగ్ ను భారీగా పెంచుకున్నారు.

 Actor Priyadarshi Wife Photo Goes Viral In Social Media-TeluguStop.com

అయితే ఎక్కువగా కమె్డియన్ రోల్స్ చేసిన ప్రియదర్శి ప్రస్తుతం ఆహా ఓటీటీ కోసం ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.

క్రైమ్ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుండగా ఈ వెబ్ సిరీస్ పై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

 Actor Priyadarshi Wife Photo Goes Viral In Social Media-నటుడు ప్రియదర్శి భార్య ఎవరో మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రముఖ దర్శకుడు సురేష్ కృష్ణ ఈ వెబ్ సిరీస్ ను నిర్మిస్తుండటం గమనార్హం.అయితే ప్రియదర్శి వ్యక్తిగత జీవితానికి సంబంధించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.

ప్రియదర్శి 2018 సంవత్సరం ఫిబ్రవరి నెలలో రిచాశర్మ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.పెళ్లిచూపులు సినిమాతో పాపులారిటీని సంపాదించుకున్న ప్రియదర్శికి వరుసగా సినిమా ఆఫర్లు వస్తున్నాయి.

ఈమె నార్త్ ఇండియా అమ్మాయి కావడం గమనార్హం.మరోవైపు జాతిరత్నాలు సినిమా తరువాత ప్రియదర్శికి ఆఫర్లతో పాటు రెమ్యునరేషన్ కూడా భారీగా పెరిగిందని తెలుస్తోంది.ప్రియదర్శి నటిస్తున్న వెబ్ సిరీస్ కు విద్యాసాగర్ ముత్తు దర్శకత్వం వహిస్తున్నారు.అతి త్వరలో ఈ వెబ్ సిరీస్ ఆహా ఓటీటీలో ప్రసారం కానుందని తెలుస్తోంది.ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో ప్రియదర్శి కాలికి గాయం కాగా గాయాన్ని పట్టించుకోకుండా ప్రియదర్శి షూటింగ్ పూర్తి చేశారని సమాచారం.

ప్రియదర్శి సినిమా కోసం కష్టపడే తీరును చూసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు.స్టార్ హీరోల సినిమాల్లో ప్రియదర్శికి పెద్దగా ఆఫర్లు రావడం లేదు.స్టార్ హీరోలు తమ సినిమాల్లో ప్రియదర్శికి ఛాన్స్ ఇస్తే ప్రియదర్శి రేంజ్ మరింత పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

#Priyadarshi #Jathi Ratnalum #Goes Viral #Ott Aha #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు