టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు ప్రియదర్శి.రీసెంట్ గా జాతిరత్నాలు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని ప్రియదర్శి తన ఖాతాలో వేసుకున్నాడు.
కేవలం కమెడియన్ గానే కాకుండా సీరియస్ పాత్రలలో కూడా తన సత్తా చూపించగలనని ప్రియదర్శి కెరియర్ ఆరంభంలోనే ప్రూవ్ చేసుకున్నాడు.ఇక ఈ మధ్య వెబ్ సిరీస్ లలోకి అడుగుపెట్టి అక్కడ కూడా తన మార్క్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు.
డిజిటల్ లోకి అడుగుపెట్టి లూజర్ అనే వెబ్ సిరీస్ లో ఓ స్పోర్ట్స్ మెన్ పాత్రలో ప్రియదర్శి నటించి మెప్పించాడు.తరువాత మెయిల్ అనే వెబ్ మూవీలో సందడి చేశాడు.
ప్రస్తుతం ఇన్ ది నేమ్ అఫ్ గాడ్(ఐ.ఎన్.జి) అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు.ఇదిలా ఉంటే ఫస్ట్ లుక్ లోనే హైప్ క్రియేట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఆహ తాజాగా ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది.
ఈ వెబ్ సిరీస్ లో ప్రియదర్శికి జోడీగా బిగ్ బాస్ ఫేం నందిని రాయ్ నటిస్తుంది.దురాశ, కామం, ప్రతీకారం అనే ఎలిమెంట్స్ చుట్టూ ఈ కథని అల్లు కొని దర్శకుడు ట్రైలర్ ని ప్రెజెంట్ చేశాడు.
వెబ్ సిరీస్ లో తెలుగు ప్రేక్షకులకి మొదటి సారి బోల్డ్ శృంగారాన్ని పరిచయం చేస్తున్నట్లు ఉంది.అలాగే హిందీలో ఈ మధ్య కాలంలో ఎక్కువగా వస్తున్నా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో తెలుగులో ఈ వెబ్ సిరీస్ ద్వారా ప్రెజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
సీనియర్ దర్శకుడు సురేష్ కృష్ణ నిర్మించిన ఈ వెబ్ సిరీస్ తో విద్యా సాగర్ ముత్తురామన్ దర్శకుడుగా పరిచయం అవుతున్నాడు.జూన్ నెలలో ఈ వెబ్ సిరీస్ లో ఆహ ఒటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వస్తుంది.
మరి ఈ క్రైమ్ జోనర్ వెబ్ సిరీస్ తెలుగు ప్రేక్షకులని ఎంత వరకు మెప్పిస్తుంది అనేది చూడాలి.