ఈ రెండేళ్లు విష్ణుని నిద్రపోనివ్వను.. షాకింగ్ కామెంట్లు చేసిన ప్రకాష్ రాజ్!

టాలీవుడ్ లో విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ప్రకాష్ రాజ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఎన్నో సమస్యలు ఉన్నాయని ఆ సమస్యల పరిష్కారం కొరకు మాత్రమే తాను ఎన్నికల్లో పోటీ చేశానని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.

 Actor Prakash Raj Shocking Comments About Vishnu-TeluguStop.com

‘మా’ సభ్యుల సమస్యలను పరిష్కరించడంతో పాటు అసోసియేషన్ ను బాగు చేయాలని తాను అనుకున్నానని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.

Telugu Interesting Facts, Prakash Raj, Shocking Comments, Vishnu-Movie

ఎన్నికల్లో విజయం సాధించి ఉంటే తనకంటూ పవర్ ఉండేదని ప్రకాష్ రాజ్ కామెంట్లు చేశారు.తాను అధ్యక్ష పదవికి ఎంపికై ఉంటే తాను చేయాలని అనుకున్న పనులను వేగంగా పూర్తి చేసేవాడినని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.ప్రస్తుతం తాను తనకు ఓటు వేసిన సభ్యుల కోసం పని చేస్తానని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.

 Actor Prakash Raj Shocking Comments About Vishnu-ఈ రెండేళ్లు విష్ణుని నిద్రపోనివ్వను.. షాకింగ్ కామెంట్లు చేసిన ప్రకాష్ రాజ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాకు ఓటు వేసిన సభ్యుల కోసం మంచు విష్ణును ప్రశ్నిస్తూనే ఉంటానని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.

మంచు విష్ణును, అతనిప్యానల్ సభ్యులను రెండు సంవత్సరాలు నిద్రపోనివ్వకుండా చేస్తానని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.

విష్ణు, అతని ప్యానల్ సభ్యులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అభివృద్ధి కొరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో చెప్పాలని రిపోర్ట్ కార్డ్ అడుగుతానని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.పోలింగ్ రోజున మోహన్ బాబు తనకు సారీ చెప్పారని మోహన్ బాబు మంచి హాస్య చతురత ఉన్న వ్యక్తి అని ప్రకాష్ రాజ్ అన్నారు.

Telugu Interesting Facts, Prakash Raj, Shocking Comments, Vishnu-Movie

మోహన్ బాబును డిస్టర్బ్ చేయకపోతే మోహన్ బాబు అంత మంచి వ్యక్తి మరొకరు లేరని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు.బీజేపీ వాళ్లు విష్ణు ఎన్నికల్లో గెలవడానికి సహకరించారని ఎన్నికల్లో రాజకీయ నాయకులు కూడా భాగమయ్యారని ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు.ప్రకాష్ రాజ్ చేసిన కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

#Vishnu #Prakash Raj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube