మొదటి భార్యతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్.. ఏం అన్నారంటే?

Actor Prakash Raj About His First Wife Lalitha Kumari And Children

ఎన్నో సినిమాలలో విలక్షణ పాత్రలో, తండ్రి ,తాత పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రకాష్ రాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన తెలుగు నటుడు కాకపోయినప్పటికీ తెలుగు వారి మదిని గెలుచుకున్నారు.

 Actor Prakash Raj About His First Wife Lalitha Kumari And Children-TeluguStop.com

ఇక తాజాగా జరిగిన మా ఎన్నికలలో ప్రకాష్ రాజ్ ఓటమిపాలయ్యాడు.ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ ఓ యు టు ఇంటర్వ్యూ ఛానల్ లో పాల్గొని తన వ్యక్తిగత విషయాల గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ క్రమంలోనే ఇతను మాట్లాడుతూ తన మొదటి భార్య లలిత కుమారికి ఎందుకు విడాకులు ఇచ్చారు అనే విషయం గురించి క్లారిటీ ఇచ్చారు.

 Actor Prakash Raj About His First Wife Lalitha Kumari And Children-మొదటి భార్యతో విడాకులపై క్లారిటీ ఇచ్చిన ప్రకాష్ రాజ్.. ఏం అన్నారంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలోనే తన మొదటి భార్య లలిత (లత) గురించి మాట్లాడుతూ తనని వివాహం చేసుకున్న తర్వాత ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిచామని ఇద్దరు కూతుళ్లు ఒక కొడుకు పుట్టాడు అని తెలిపారు.

అయితే తన కొడుకు ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు గాలిపటం ఎగరేస్తూ పొరపాటున జారి కింద పడటంతో మరణించాడని తెలియజేశారు.అయితే ఇలా వైవాహిక జీవితంలో కొన్ని సంవత్సరాలు సంతోషంగా ఉన్న మా ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఇద్దరం నిర్ణయం తీసుకొని కోర్టుకు వెళ్లి విడాకులతో విడిపోయాము.అయితే తాను కేవలం లలితకు మాత్రమే విడాకులు ఇచ్చాను కానీ నా పిల్లలు తన తల్లి కి విడాకులు ఇవ్వలేదు.

నా తల్లి తన కోడలకు విడాకులు ఇవ్వలేదు అంటూ చెప్పుకొచ్చారు.

Telugu Children, Divorce, Lalitha Kumari, Prakash Raj-Movie

ఇలా నా భార్యతో విడాకులు తీసుకున్న తర్వాత నేను మరి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని తన పెద్ద కూతురుతో చెప్పినప్పుడు అందుకు తన పెద్ద కూతురు ప్రోత్సహించిందని వీరందరి సమక్షంలోనే తను 2010వ సంవత్సరంలో మరో పెళ్లి చేసుకున్నానని తెలిపారు.ఈ క్రమంలోనే మాకు బాబు పుట్టాడు అని వాడిని నా కూతుర్లు తమ్ముడు గానే భావిస్తారని, ప్రతి సంవత్సరం రాఖీ పండుగ రోజు హైదరాబాద్ వచ్చి తన తమ్ముడికి రాఖీ కట్టి వెళ్తారని తెలిపారు.వీలున్నప్పుడల్లా మేము చెన్నై వెళ్తాము వాళ్ళు హైదరాబాద్ వస్తారని ప్రకాష్ రాజ్ తెలిపారు.

అలాగే తన రెండవ భార్య మొదటి భార్యకు చీరలు పంపుతుందని తాను కూడా తనకు చీర పంపుతుందని వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవని ప్రకాష్ రాజ్ ఈ సందర్భంగా తెలిపారు.రేపు పొద్దున నా పెద్ద కూతురు పెళ్ళి జరిగితే పెళ్లి పీటలపై నేను లత కూర్చొని పెళ్లి చేయాల్సి ఉంటుందని తన మొదటి భార్య పట్ల వారి విడాకులు పట్ల ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్ చేశారు.

#Lalitha Kumari #Divorce #Prakash Raj

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube