కొత్త కారు కొంటానని చెబితే శ్రీకాంత్ అలా అన్నాడట.. డబ్బులు వృథా చేయకంటూ?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫ్యామిలీ హీరోగా శ్రీకాంత్ మంచిపేరును సంపాదించుకున్నారు.120కు పైగా సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శ్రీకాంత్ నటించారు.హీరోగా ఆఫర్లు తగ్గడంతో ప్రస్తుతం విలన్ పాత్రలపై శ్రీకాంత్ దృష్టి పెట్టారు.అఖండ భారీ విజయాన్ని అందుకుంటే విలన్ గా కూడా శ్రీకాంత్ బిజీ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.

 Actor Prabhu Comments About Srikanth And Tarun Details, Comments About, Srikan-TeluguStop.com

శ్రీకాంత్, ఊహ దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు.

నటుడు ప్రభు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శ్రీకాంత్, తరుణ్ తనకు మంచి స్నేహితులని తెలిపారు.

శ్రీకాంత్ తో కలిసి తాను అరుణ్ ప్రసాద్ డైరెక్షన్ లో ప్రేమ సందడి అనే సినిమాలో నటించానని ప్రభు అన్నారు.శ్రీకాంత్, తరుణ్ తో కలిసి తాను క్రికెట్ ఆడేవాడినని ప్రభు పేర్కొన్నారు.

హీరోలతో చనువు ఉన్నా తాను గీత దాటనని ప్రభు పేర్కొన్నారు.వేణు ఇంట్లో అందరూ కూడా తనను ప్రేమగా చూసుకుంటున్నారని ప్రభు చెప్పుకొచ్చారు.

శ్రీకాంత్ తో తన దగ్గర ఇండికా కారు ఉందని కొత్త కారు తీసుకోవాలని అనుకుంటున్నానని చెప్పానని శ్రీకాంత్ తనతో ఆడి కొంటున్నావా.? లేక జాగ్వార్ కొంటున్నావా.? అని అడిగారని ప్రభు తెలిపారు.ఆ తర్వాత తన కారులో ఏసీ ఉందా? అని శ్రీకాంత్ అడగగా ఉందని చెప్పానని ప్లేయర్ ఉందా? అంటే ఉందని చెప్పగా మళ్లీ ఇంకో కారు ఎందుకని అడిగారని శ్రీకాంత్ వెల్లడించారు.

తరుణ్ ను ఫిల్మ్ నగర్ క్లబ్ లో జాయిన్ అవుతానని 3 లక్షలు కట్టాలని చెప్పగా తరుణ్ వెటకారంగా కూకట్ పల్లిలో ఉన్న నువ్వు ఈ సౌకర్యాల కోసం వస్తావా.? అని అడిగారని ప్రభు తెలిపారు.తరుణ్ అవసరమైతే తన కార్డును వినియోగించుకోవాలని చెప్పారని ప్రభు వెల్లడించారు.తరుణ్ ను పేరు పెట్టి పిలిచే చనువు ఉందని ప్రభు పేర్కొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube