ప్రభాస్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చిన స్నేహితుడు.. ఏం చెప్పారంటే?

ప్రభాస్ సినిమాలకు సంబంధించి వరుసగా అప్ డేట్లు వస్తున్నా పెళ్లికి సంబంధించిన అప్ డేట్లు మాత్రం రావడం లేదు.ప్రభాస్ కుటుంబ సభ్యులు సైతం ప్రభాస్ పెళ్లి ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్నకు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు.

 Actor Prabhas Sreenu Given Clarity About Hero Prabhas Marriage, Actor Prabhas Sr-TeluguStop.com

ప్రభాస్ వయస్సు ప్రస్తుతం 42 సంవత్సరాలు.ప్రభాస్ తోటి హీరోలంతా పెళ్లి చేసుకోవడంతో పాటు తమ వారసులను సైతం ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు.

అసలు ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా? లేదా? అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.ప్రభాస్ రాధేశ్యామ్ ట్రైలర్ లో తన చేతిలో ప్రేమ, పెళ్లి లేవని చెప్పడం సినిమా గురించే చెప్పారా? లేక రియల్ లైఫ్ గురించి చెప్పారా? అనే కామెంట్లు సైతం వినిపించాయి. ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్స్ లో ప్రభాస్ శ్రీను కూడా ఒకరనే సంగతి తెలిసిందే.ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చాలా సినిమాల్లో ప్రభాస్ శ్రీను నటించారు.

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లి గురించి ప్రభాస్ శ్రీనుకు ప్రశ్న ఎదురైంది.ఆ ప్రశ్న గురించి ప్రభాస్ శ్రీను స్పందిస్తూ తనకు ఈ తరహా ప్రశ్న ఎదురు కావడం ఇదే తొలిసారి కాదని ప్రభాస్ శ్రీను అన్నారు.సమయం వస్తే మాత్రమే ప్రభాస్ పెళ్లి జరుగుతుందని మనం అనుకున్నంత మాత్రాన ప్రభాస్ పెళ్లి జరగదని అన్నారు.ప్రపంచానికి తెలిసేలా ప్రభాస్ పెళ్లి చేసుకుంటారని ప్రభాస్ శ్రీను కామెంట్లు చేశారు.

ప్రభాస్ శ్రీను ప్రభాస్ పెళ్లి గురించి కూల్ గా ఇచ్చిన ఈ సమాధానం వైరల్ అవుతోంది.ప్రభాస్ నటించిన సినిమాలు ఈ ఏడాది రిలీజవుతున్న నేపథ్యంలో ఆ సినిమాల ప్రమోషన్లలో కూడా ప్రభాస్ పెళ్లి గురించి స్పందించక తప్పదు.

ప్రభాస్ పెళ్లి చేసుకుంటే మాత్రం తమ హృదయాలు బద్దలవుతాయని అమ్మాయిలు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

Prabhas Sreenu Clarity On Hero Prabhas Marriage

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube