నంది తెచ్చిన తంటా..అడ్డంగా ఇరుక్కుపోయిన లోకేష్     2017-11-21   05:15:48  IST  Bhanu C

చిలికి చిలికి గాలివాన కాస్తా తుఫాను అయ్యింది…నంది అవార్డుల విషయం శాంతంగా ఉంటున్న తరుణంలో లోకేష్ మాట్లాడిన మాటలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ లో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నరు అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపై నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు.అసలే రచయిత..అందులోనూ కాకేక్కి ఉన్నాడు అంతే అమాంతం తనదైన స్టైల్ లో లోకేష్ మీద మాటల తూటాలు పేల్చాడు.

పోసాని కృష్ణమురళి హైదరాబాద్‌లో మంగళవారం ప్రెస్‌ మీట్‌ పెట్టారు..పోసాని మాట్లాడుతూ..‘ట్యాక్స్ ఇక్కడ కడితే అక్కడ పనికిరారా,,విమర్శించకూడదా,,లోకేశ్‌… చదువుకున్నావా.. బుద్ది, జ్ఞానం, సంస్కారంతో మాట్లాడుతున్నావా… మీరు ఇక్కడ ట్యాక్స్ కట్టటం లేదా,, ప్రభుత్వం వచ్చాక కూడా ఇక్కడ ఇళ్లు కట్టుకున్నారు కదా,,. మరి అక్కడ ఎందుకు రాజకీయం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. నీలాంటి వాళ్ళు కేసీఆర్ ని చూసి నేర్చుకోవాలి..నంది అవార్డులు ఏమన్నా నీ అబ్బ సొత్తా.. చంద్రబాబు ఇంతకూ ముందు ఉన్న ప్రభుత్వాలని విమర్శించాడు కదా మరి చంద్రబాబు నాన్ లోకాలా…ఏపీ ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులని విమర్శిస్తే నాన్ లోకల్ అంటారా.మరి జ్యురిలో ఉన్న సభ్యులు మాట ఏంటి వాళ్ళు కూడా హైదరాబాదులోనే ఉంటున్నారు ఇక్కడి పేర్లమీద ఆధార కార్డు ఉంది మరి వాళ్ళని జ్యూరి మెంబెర్స్ గా ఎలా తీసుకున్నారు

అవార్డుల విషయంలో రాద్ధంతం చేస్తే నందులు తీసేస్తాం అంటున్నారు మరి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఎంత రాద్ధంతం జరిగింది మరి వారిని ఎందుకు తీసేయలేదు. భారత రత్న, పద్మ అవార్డుల విషయంలో కూడా చాలా సార్లు విమర్శలు వచ్చాయి అవి తీసేశారా అంటూ పదునైన మాటలతో పోసాని లోకేష్ పై విరుచుకు పడ్డారు. టెంపర్ సినిమాలో నాకు వచ్చిన ఉత్తమ సహాయ నటుడు అవార్డుని నేను తిరస్కరిస్తున్నాను అంటూ పోసాని ప్రకటించారు.

ఈ అవార్డు అందుకోవటానికి నేను సిగ్గుపడుతున్నా. ఇక మీదట చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఐవీఆర్ఎస్ పద్దతిలో విజేతలను ఎంపిక చేయండి అంటూ ధ్వజమెత్తారు పోసాని. మొత్తానికి నందుల అవార్డులని ప్రకటించినపుడు చాలా మంది అసంతృప్త నటులు అనేకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు..వారికి సినిమా వాళ్ళతోనే బదులు చెప్పించాల్సింది పోయి..రాజకీయనాయకులు కలిపించుకుంటే ఇలాంటి సంఘటనలే ఉత్పన్నమవుతాయి.