డబ్బులు అడిగితే మారుతి అలా చేశారు.. పార్వతీశం ఆసక్తికర వ్యాఖ్యలు!

Actor Parvateesham Interesting Comments About Director Marthi

సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అని అనిపించుకోవడం సులభం కాదు.టాలెంట్ ఉన్న డైరెక్టర్లు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు.

 Actor Parvateesham Interesting Comments About Director Marthi-TeluguStop.com

ఎంతో కష్టపడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్లలో మారుతి ఒకరు.ఈరోజుల్లో, బస్ స్టాప్ సినిమాలతో దర్శకునిగా కెరీర్ ను మొదలుపెట్టిన మారుతి కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్నాయి.

ప్రస్తుతం పక్కా కమర్షియల్ సినిమాతో మారుతి బిజీగా ఉన్నారు.

 Actor Parvateesham Interesting Comments About Director Marthi-డబ్బులు అడిగితే మారుతి అలా చేశారు.. పార్వతీశం ఆసక్తికర వ్యాఖ్యలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మారుతి సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా నిర్మాతల కు  నష్టం వచ్చిన సందర్భాలు చాలా తక్కువ.

అతి తక్కువ బడ్జెట్ తో క్వాలిటీ సినిమాలను తెరకెక్క్కించే దర్శకుడిగా మారుతికి పేరుంది.నటుడు పార్వతీశం ఒక ఇంటర్వ్యూలో మారుతి గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

కేరింత సినిమాకు ముందు తాను చిన్నచిన్న పాత్రల్లో నటించానని పార్వతీశం తెలిపారు.బంగారు కోడిపెట్ట, ఢీ ఫర్ దోపిడి సినిమాలలో చిన్న పాత్రలు చేశానని పార్వతీశం అన్నారు.

కొన్ని సినిమాల పేర్లు కూడా ఎవరికీ తెలియదని పార్వతీశం పేర్కొన్నారు.

Telugu Maruthi, Pakka, Parvateesam, Serials, Tollywood-Movie

ఒక సీరియల్ కూడా తాను చేశానని అయితే ఆ సీరియల్ ఆగిపోయిందని పార్వతీశం వెల్లడించారు.ఇండస్ట్రీని వదిలేసి వెళ్లిపోదామని ఎప్పుడూ అనుకోలేదని పార్వతీశం చెప్పుకొచ్చారు.కోట శ్రీనివాసరావులా మంచి పేరు తెచ్చుకుందామని భావించానని పార్వతీశం పేర్కొన్నారు.

కొన్ని సినిమాల్లో తాను డబ్బు కోసం నటించానని పార్వతీశం వెల్లడించారు.

Telugu Maruthi, Pakka, Parvateesam, Serials, Tollywood-Movie

డబ్బులు కావాలని మేసేజ్ పెడితే గంటలో మారుతి అకౌంట్ కు పంపించారని డబ్బులు అకౌంట్ లో లేకపోతే ఆఫీస్ కు వెళ్లి తీసుకోవాలని మారుతి చెప్పేవారని పార్వతీశం పేర్కొన్నారు.ప్రస్తుతం వరుస సినిమాలతో పార్వతీశం బిజీగా ఉన్నారు.అయితే సక్సెస్ రేట్ తక్కువగా ఉన్న పార్వతీశం హీరోగా తన స్థాయిని మరింత పెంచుకుంటారేమో చూడాల్సి ఉంది.

#Serials #Maruthi #Pakka #Parvateesam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube