ఈ నటి ఎప్పుడూ దిగులుగా ఉండేవారట.. కారణమిదేనా..?

తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లో నటించి నటిగా సుజాత ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.దాసరి నారాయణరావు డైరెక్షన్ లో వచ్చిన గోరింటాకు సినిమాతో సుజాత టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

 Actor Paruchuri Gopalakrishna Interesting Comments About Sujatha-TeluguStop.com

ఆ మూవీ సక్సెస్ సాధించడంతో సుజాతకు సినిమా ఇండస్ట్రీలో నటిగా వరుస ఆఫర్లు వచ్చాయి.తెలుగులో పెళ్లి, శ్రీరామదాసు, సూత్రధారులు సినిమాలు సుజాతకు నటిగా మంచిపేరును తెచ్చిపెట్టాయి.

14 సంవత్సరాల వయస్సులోనే సుజాత నటిగా కెరీర్ ను మొదలుపెట్టారు. సుజాతది ప్రేమ వివాహం కాగా పెద్దలకు ఇష్టం లేకపోయినా వాళ్లను ఎదురించి మరీ సుజాత వివాహం చేసుకున్నారు.

 Actor Paruchuri Gopalakrishna Interesting Comments About Sujatha-ఈ నటి ఎప్పుడూ దిగులుగా ఉండేవారట.. కారణమిదేనా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పెళ్లి చేసుకున్న తర్వాత అమెరికాకు వెళ్లిన సుజాత అక్కడి సంప్రదాయాలు నచ్చకపోవడంతో ఇండియాకు తిరిగి వచ్చారు.ఆ తర్వాత ఇండియాలోనే స్థిరపడిన సుజాతకు ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.

ప్రముఖ రచయిత, నటుడు అయిన పరుచూరి గోపాలకృష్ణ ఒక సందర్భంలో సుజాత గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.చంటి సినిమాలో వెంకటేష్ తల్లి పాత్రలో సుజాత అద్భుతంగా నటించారని దాసరి గారి సినిమాలలో సుజాత కచ్చితంగా ఉండేవారని తెలిపారు.ఒక సందర్భంలో సుజాత తనతో ఒక సందర్భంలో తనతో సుజాత గారు మీరు నన్ను ఎప్పుడైనా కలిశారా ? అని అ్దిగారని ఆ సమయంలో తాను సుజాత నటించిన మానవుడు మహనీయుడు సినిమాకు పని చేశానని చెప్పానని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.

కెమెరా ముందు సుజాత ఎప్పుడూ చలాకీగా ఉండేవారని అయితే బయట మాత్రం ఆమె ఎప్పుడూ దిగులుగా కనిపించేవారని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు.2011 సంవత్సరంలో ఆమె మరణించడం దురదృష్టకరమని ఆమె జీవించి ఉంటే బామ్మ, అమ్మమ్మ పాత్రలు పోషించేవారని పరుచూరి గోపాలకృష్ణ వెల్లడించారు.సుజాత తన వ్యక్తిగత సమస్యల వల్లే దిగులుగా ఉండేవారని తెలుస్తోంది.

#Actress Sujatha

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు