ఖరీదైన కారు కొన్న నిఖిల్.. ధర ఎంతంటే..?

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాపీడేస్ సినిమా ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు హీరో నిఖిల్.ఆ సినిమా తరువాత నిఖిల్ హీరోగా నటించిన యువత, స్వామి రారా, కార్తికేయ, సూర్య వర్సెస్ సూర్య, ఎక్కడికి పోతావు చిన్నవాడా, అర్జున్ సురవరం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయి.

 Hero Nikhil Siddarth Buying A New Range Rover Car-nikhil -2.10 Crores-tollywood--TeluguStop.com

హీరోగా వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటున్న నిఖిల్ ప్రస్తుతం 18 పేజెస్ అనే సినిమాలో నటిస్తున్నారు.

అయితే తాజాగా ఈ నటుడు ఖరీదైన రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశారు.

ఈ కారు ఫోటోలను నిఖిల్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.తను హీరోగా నటించి విడుదలైన అయిన అర్జున్ సురవరం సినిమా హిట్ కావడంతో కారును కొనుగోలు చేసినట్లు నిఖిల్ తెలిపారు.

గతేడాదే నిఖిల్ కారును కొనుగోలు చేయాల్సి ఉండగా కరోనా విజృంభణ, లాక్ డౌన్ నిబంధనల వల్ల కారును కొనుగోలు చేయడం ఆలస్యమైంది.

నిఖిల్ కొనుగోలు చేసిన కారు రేంజ్ రోవర్ స్పోర్ట్స్ ఆటోగ్రఫీ కారు కాగా ఈ మోడల్ లో మొత్తం 10 మోడల్స్ అందుబాటులో ఉండగా ఈ కారు ధర కోటి నుంచి 2.10 కోట్ల రూపాయల వరకు ఉంది.నిఖిల్ ఏకంగా కోటి రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఖర్చు చేసి కారు కొనుగోలు చేసినట్లు అర్థమవుతోంది.ఇండస్ట్రీలో చాలా తక్కువమంది సెలబ్రిటీలకు మాత్రమే ఇంత ఖరీదైన కార్లు ఉన్నాయి.

నిఖిల్ లగ్జరీ కారుతో దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.మరోవైపు నిఖిల్ చందూ మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 సినిమాలో కూడా నటిస్తున్నారు.

కార్తికేయకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై బాగానే అంచనాలు ఉన్నాయి.మరోవైపు గతేడాది లాక్ డౌన్ సమయంలో నిఖిల్ పల్లవిని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube