ప్రమాదానికి గురై కాలు విరగొట్టుకున్న నటుడు నవదీప్... వీడియో వైరల్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో హీరోగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నవదీప్( Navadeep ) ఈ మధ్యకాలంలో సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి.

ఒకప్పుడు హీరోగా నటించిన ఈయన అనంతరం విలన్ పాత్రలలో కూడా నటించారు.

అలాగే ప్రస్తుత సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా నటిస్తున్నారు.ఇకపోతే నవదీప్ సినిమాలు మాత్రమే కాకుండా వెబ్ సిరీస్లలో( web series ) కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా నవదీప్ సందడి చేస్తూ ఉంటారు.

Actor Navdeep Broke His Leg In An Accident, Navadeep, Tejaswi, Video Viral, Leg

ఇలా తరచూ ప్రేక్షకులను ఎంతో ఎంటర్టైన్ చేస్తూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే ఈయన ప్రమాదానికి గురయ్యారని తెలుస్తోంది.నవదీప్ కాలికి ఫ్రాక్చర్ అయినట్టు తెలుస్తుంది.ఈ క్రమంలోనే ఈయనని పరామర్శించడానికి వెళ్లినటువంటి బిగ్ బాస్ బ్యూటీ తేజస్విని ( Tejaswi )మదివాడ ఈయనకు సంబంధించిన వీడియోని షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

Advertisement
Actor Navdeep Broke His Leg In An Accident, Navadeep, Tejaswi, Video Viral, Leg

అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది తెలియదు కానీ ఈయన మాత్రం కాలు విరిగొట్టుకున్నట్టు తెలుస్తుంది.ప్రస్తుతం కాలికి బ్యాండేజ్ కూడా వేసి ఉంది.

Actor Navdeep Broke His Leg In An Accident, Navadeep, Tejaswi, Video Viral, Leg

అయితే ఈ వీడియోలో నవదీప్ కాలికి గాయం కావడంతో తేజస్విని మాత్రం ఆయనను ఆటపట్టిస్తూ ఓ రీల్ చేశారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారడంతో అభిమానులు అసలు నవదీప్ కాలికి ఏం జరిగింది? ఎలా జరిగింది అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈయనకి ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

ఇకపోతే గతంలో ఓసారి తేజస్వికి ఇలాగే జరిగితే నవదీప్ కూడా తనని అప్పుడు ఆటపట్టించారు.అయితే తేజస్వి మాత్రం దానికి రివెంజ్ తీర్చుకున్నట్లు అనిపిస్తుంది.ఇక చివరిగా నవదీప్ న్యూసెన్స్ అనే సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

స్టార్ హీరో విజయ్ దేవరకొండ రికార్డును బ్రేక్ చేసిన నాని.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు