గడ్డం తెల్లబడుతుంది.. పెళ్లి చేసుకోండి అన్న.. నెటిజెన్ కి షాకింగ్ రిప్లై ఇచ్చిన నవదీప్?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యంగ్ హీరో నవదీప్ గురించి అందరికీ సుపరిచితమే.ఈయన ఎన్నో చిత్రాలలో హీరోగా నటించి అందరిని మెప్పించాడు.

 Actor Navdeep Funny Commentson His Marriage Trollings, Navadeep, Tollywood, Vira-TeluguStop.com

అనంతరం హీరో ఫ్రెండ్ పాత్రలో కూడా అద్భుతమైన నటన ద్వారా ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న నవదీప్ విలన్ గా కూడా అందరినీ బయపెట్టారు.ఇలా విలన్ పాత్ర ద్వారా అందరినీ మెప్పించిన నవదీప్ ప్రస్తుతం  ట్రెండ్ ఫాలో అవుతూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు.

ఈ క్రమంలోనే నిత్యం ఏదో ఒక వీడియోలు-ఫొటోలు ద్వారా సోషల్ మీడియాలో అందరికీ దగ్గరవుతున్న నవదీప్ తాజాగా తన పెళ్లి గురించి తానే సెటైర్ వేసుకుంటూ కామెంట్ చేశారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

యంగ్ హీరో మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండటం వల్ల ఎంతో మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఇతనికి పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నారు.ఇలా సలహా ఇచ్చిన నెటిజన్లకు నవదీప్ తనదైన శైలిలో సమాధానం చెబుతూ తన పెళ్లి గురించి తానే సెటైర్ వేస్తున్నారు.

ఈ క్రమంలోనే కొంతమంది నెటిజన్స్ అన్నా గడ్డం కూడా తెల్లగా మెరిసిపోతుంది.పెళ్లి చేసుకోవచ్చు కదా అంటూ సలహాలు ఇచ్చారు.

ఈ సలహాకు స్పందించిన నవదీప్ ట్విట్టర్లో వద్దురా.సోదరా అనే టైటిల్ పెట్టి ఒక వీడియోని విడుదల చేశారు.ఈ క్రమంలోనే నవదీప్ మాట్లాడుతూ అన్న గడ్డం తెల్లబడుతుంది త్వరగా పెళ్లి చేసుకోండి అంటూ కొందరు సలహాలు ఇస్తున్నారు.అయితే గడ్డం తెల్లబడితే చేసుకోవాల్సింది ట్రిమ్మింగ్ కానీ పెళ్ళి కాదు.

దురద పెడితే గోకుంటాం… కానీ తోలు తీసుకోము కదా అంటూ తను ఇప్పుడే పెళ్లి చేసుకోనని ఈ వీడియో ద్వారా నవదీప్ తన పెళ్లి గురించి వెల్లడించారు.ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube