సినిమా పరిశ్రమ అంటేనే బయటకు చాలా ఆర్భాటంగా కనిపిస్తుంది.ప్రతిదీ లగ్జరీగానే కనిపిస్తుంది.
అయితే గతంలో స్టార్ హీరోలు మాత్రమే కారవాన్లు ఉపయోగించేవారు.హీరోలు, హీరోయిన్లు ఇబ్బందికి పడకూడదు అని నిర్మాతలు వారి కోసం ఈ సదుపాయం కల్పించేవారు.
కానీ ప్రస్తుతం హీరోలే కాదు. క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా లగ్జరీ కారవాన్లు వాడుతున్నారు.
తమ షాట్ కంప్లీట్ అయితే చాలు ఆయా నటులు బయట కనిపించరు తమ కారవాన్లలో సేద తీరుతారు.మరో షాట్ రెడీ కాగానే బయటకు వస్తారు.
తాజాగా సీనియర్ నటుడు నరేష్ కూడా లగ్జరీ కారవాన్ ఉపయోగిస్తున్నాడు.దీని కోసం తను భారీగానే డబ్బు ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.
80వ దశాబ్దంలో నరేష్ హీరోగా బాగా పేరు సంపాదించాడు.ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాల్లో నటించాడు.
విజయ నిర్మల దర్శకత్వంలో ఆయన ఎక్కువగా సినిమాలు చేశాడు.ఆ తర్వాత ఆయన సినిమాలు చేయడం తగ్గించాడు.
అలా అనడం కంటే అవకాశాలు కాస్త తగ్గాయి అని చెప్పుకోవచ్చు.దీంతో బుల్లితెరపై సందడి చేయడం మొదలు పెట్టాడు.
కౌంట్ డౌన్ లాంటి గేమ షోలు చేశాడు.మళ్లీ ఇప్పుడిప్పుడే క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్నాడు.
ప్రస్తుతం ఆయన క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటున్నాడు.అంతేకాదు.
టాలీవుడ్ లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందాడు.
మొత్తానికి కాస్ట్లీ క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రస్తుతం మంచి స్వింగ్ లో కొనసాగుతున్నాడు.ఆయన హీరోగా బాగానే డబ్బు కూడబెట్టడంతో ప్రస్తుతం లగ్జరీ లైఫ్ ని గడుపుతున్నాడు.తాజాగా ఆయన ఓ విలాసవంతమైన కారవాన్ వాడుతున్నాడట.
అటు విజయ్ కృష్ణ ఫిల్మ్ స్టూడియోస్ కూడా ఏర్పాటు చేస్తున్నాడు.ఏసీ ఫ్లోర్స్ తో ఈ స్టూడియో షూటింగులు జరుపుకునేందుకు సిద్ధం అవుతోంది.
అయితే ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టులుగా కొనసాగుతున్న ఎవరికి కూడా కారవాన్ లేదట.ఉన్నా కూడా నిర్మాతలు ఏర్పాటు చేసినవేనట.
అయితే నరేశ్ మాత్రం సొంతంగా కారవాన్ వాడటం విశేషం.