జాతకాన్ని ఎవరైనా నమ్మి తీరాల్సిందేనన్న నటుడు.. అలా జరిగిందంటూ?

మనలో చాలామంది జాతకాలను అస్సలు నమ్మరు.జాతకాలు నమ్మేవాళ్లపై కూడా నెగిటివ్ కామెంట్లు చేస్తారు.

 Actor Narasimha Raju  Interesting Comments On Jatakam, Interesting Comments, Jat-TeluguStop.com

సీనియర్ నటుడు నరసింహ రాజు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.ఏడు సంవత్సరాల క్రితం తనకు సినిమాలు, సీరియళ్లు లేవని 2018 సంవత్సంలో బెస్ట్ ఆర్టిస్ట్ గా తనకు ఎక్కువశాతం ఓటింగ్ వచ్చిందని తెలిపారు.

మద్రాస్ నుంచి హైదరాబాద్ లో స్థిరపడ్డాక దాసరి నారాయణరావు కొన్ని వ్యాపారాలను అప్పజెప్పారని నరసింహరాజు పేర్కొన్నారు.

ఆ సమయంలో రోజువారీ శాలరీ ఇచ్చేవారని నరసింహరాజు చెప్పుకొచ్చారు.

దాసరి నారాయణరావు శిష్యులలో తాను ఒకడినని కష్టం అని ఎవరు చెప్పినా ఆదుకోవడంలో నరసింహరాజు ముందువరసలో ఉంటారని నరసింహరాజు తెలిపారు.తనకు రోజుకు 1500 ఆ సమయంలో ఇచ్చేవారని ఆ సమయంలో హైదరాబాద్ లో గజం 80 రూపాయలు అని ఆ సమయంలో రోజుకు 15 గజాలు కొనుగోలు చేసేవాడినని నరసింహ రాజు తెలిపారు.

అయితే టైమ్, జాతకం కొననివ్వదని తాను టైమ్ ను, జాతకాన్ని నమ్ముతానని నరసింహరాజు చెప్పుకొచ్చారు.

Telugu Businesses, Dasari Yana Rao, Jatakam, Offers, Simha Raju, Simharaju, Seri

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నెలకు 22 రోజులు పని చేస్తున్నానని ఇంత బిజీగా ఉండే ఆర్టిస్టులు ఎవరూ లేరని నరసింహరాజు వెల్లడించారు.తాను చేసిన సీరియల్స్ తమిళంలో సక్సెస్ సాధించాయని ఆ సీరియళ్లకు మంచి టీఆర్పీ రేటింగ్స్ వస్తున్నాయని నరసింహరాజు చెప్పుకొచ్చారు.

Telugu Businesses, Dasari Yana Rao, Jatakam, Offers, Simha Raju, Simharaju, Seri

సినిమాలలో చిన్న ఆర్టిస్టులకు ప్రస్తుతం అవకాశాలు లేవని సీరియళ్లు చేస్తే అందరికీ గుర్తుంటామని నరసింహరాజు అన్నారు.సీరియల్ అంటే ఒక వారంలో ఒక సినిమా చేసినట్టే అని నరసింహరాజు తెలిపారు.జనాలకు త్వరగా దగ్గరవుతామని ప్రొడ్యూసర్లకు సీరియళ్ల ద్వారా నష్టం వచ్చే అవకాశాలు ఉండవని నరసింహరాజు పేర్కొన్నారు.

ఒకప్పుడు వరుస సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న నరసింహరాజు ప్రస్తుతం పూర్తిగా సీరియళ్లకే పరిమితం కావడం గమనార్హం.హీరోగా కూడా నరసింహరాజు కెరీర్ లో ఎన్నో విజయాలు ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube