వెంకీ తలనొప్పిని నాని ఎత్తుకున్నాడా?

నాని వరుసగా చిత్రాలు చేసుకుంటూ వెళ్తున్నాడు.గత రెండు మూడు సంవత్సరాలుగా మినిమం సక్సెస్‌గా చిత్రాలు చేసుకుంటూ దూసుకు పోతున్న నాని ప్రస్తుతం నాగార్జునతో కలిసి ఒక మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేస్తున్నాడు.

 Actor Nani To Work In Maruthis Direction-TeluguStop.com

ఆ చిత్రం విడుదలకు సిద్దం అవుతుంది.మరో వైపు బిగ్‌బాస్‌ సీజన్‌ 2ను హోస్ట్‌ చేస్తున్నాడు.

తాజాగా గౌతమ్‌ దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే చిత్రాన్ని చేసేందుకు సిద్దం అయ్యాడు.ఈ చిత్రాలు మాత్రమే కాకుండా మారుతి దర్శకత్వంలో మరోసారి నాని ఒక చిత్రంను చేయబోతున్నాడు.

అప్పుడే ఆ సినిమాకు ‘సభకు నమస్కారం’ అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది.భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం కథ వెంకీ కోసం మారుతి రాసుకున్నట్లుగా సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం వెంకటేష్‌ కోసం కొన్నాళ్ల క్రితం దర్శకుడు మారుతి ‘రాధా’ అనే చిత్రంకు స్క్రిప్ట్‌ను సిద్దం చేశాడు.మారుతి దర్శకత్వంలో అనుకున్న ఆ సినిమాను రాజకీయ నేపథ్యంలో తెరకెక్కించాలని భావించారు.ఒక హోం మంత్రి ప్రేమలో పడితే ఎలా ఉంటుంది, ఆయన రాజకీయ వ్యవస్థను తనకు తగ్గట్లుగా, తన ఆలోచనలకు తగ్గట్లుగా ఎలా మల్చుకున్నాడు అనే విషయాన్ని మారుతి వెంకీతో చూపించాలని భావించాడు.కాని కథ వివాదాస్పదం అవ్వడంతో సినిమా షూటింగ్‌ ప్రారంభం కాగానే వాయిదా వేయడం జరిగింది.

మారుతి దర్శకత్వంలో సినిమాను వెంకీ వదుకోగా, దాన్నే ఇప్పుడు నాని నెత్తికి ఎత్తుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

నాని, మారుతిల కాంబిలో తెరకెక్కబోతున్న చిత్రంలో నాని ఎమ్మెల్యేగా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతుంది.

ఎమ్మెల్యే అయిన ఒక యువకుడు తన చుట్టు ఉన్న సమస్యలను పరిష్కరించుకుంటూ, తన ప్రేమను దక్కించుకోవడం కోసం పడ్డ తాపత్రయంను దర్శకుడు మారుతి చూపించబోతున్నాడు.అతి మంచితనంతో ఎమ్మెల్యే అయిన నాని పడ్డ ఇబ్బందులు కూడా ఫన్నీగా దర్శకుడు చూపించబోతున్నాడు.

ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్టోరీ చర్చలు జరుగుతున్నాయి.

గతంలో కథ వివాదాస్పదం అవ్వడంతో ముందు జాగ్రత్తగా కథలో పలు మార్పులు చేర్పులు చేసి, స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

నాని వరుసగా సక్సెస్‌ చిత్రాలతో జోరుమీదున్న నేపథ్యంలో ఈ చిత్రం కూడా తప్పకుండా విజయాన్ని దక్కించుకుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.‘సభకు నమస్కారం’ చిత్రం వచ్చే సంవత్సరం వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

వెంకీ వద్దనుకున్న చిత్రాన్ని నాని నెత్తికి ఎత్తుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube