తెలుగు ప్రేక్షకులకు నాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నాడు.
తెలుగులో ఎన్నో సినిమాలు లో నటించి స్టార్ హీరో ఇమేజ్ ని దక్కించుకున్నాడు.కాగా హీరో నానికి రెండు తెలుగు రాష్ట్రాలలో బీభత్సమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది అన్న విషయం మనందరికీ తెలిసిందే.
అయితే హీరో నాని ఇప్పటివరకు కూడా ప్రేమ కథలు, కుటుంబ కథా సినిమాలలో ఎక్కువగా నటించాడు.కానీ మొట్టమొదటిసారిగా హీరో నాని ఒక మాస్ మూవీతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఇక హీరో నాని నటించిన మాస్ మూవీ దసరా.ఇప్పటికే దసరా సినిమా నుంచి విడుదలైన పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని నాని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు చిత్ర బృందం.
ఈ నేపథ్యంలోనే ఈ ఈవెంట్ లో భాగంగా హీరో నాని మాట్లాడుతూ తెలంగాణ భాషలో మాట్లాడి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.

తాజాగా మల్లారెడ్డి కాలేజీలో జరిగిన ఈ టీజర్ ఈవెంట్ కార్యక్రమంలో నాని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ.మీ అందరిని చూస్తుంటే నాకు ఒక మాట ఇవ్వాలని అనిపిస్తోంది.అందుకే మీకు ఒక మాట ఇస్తున్నాను.దసరా సినిమా రిలీజ్ అయిన తర్వాత మీరందరూ ఈ కాలేజీ చెట్ల కింద గట్ల పైన కూర్చొని దసరా మూవీ గురించే మాట్లాడు కుంటారు.ఇది పక్కా.2022లో ఒక కేజీఎఫ్, ఒక ఆర్ఆర్ఆర్ 2023లో ఒక దసరా ఇది మాత్రం పక్కా అది లెక్క అంటూ మాస్ స్టేట్మెంట్ ను ఇచ్చారు నాని.కాగా నాని వ్యాఖ్యలతో ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి.అంతేకాకుండా సినిమా సక్సెస్ మీట్ కు వచ్చినప్పుడు స్టూడెంట్స్ తో కలిసి డాన్స్ కూడా చేస్తాను అని చెప్పుకొచ్చాడు హీరో నాని.
