ఈ సినిమా కోసం ప్రాణం పెట్టి పని చేసా... ఇమేజ్ కోసం ఏ పని చేయలేదు: నాని

Actor Nani Sensational Comments About Dasara Movie,Dasara,Keerthy Suresh,Natural Star Nani,Sreekanth Odela,De Glamor Role

నాచురల్ స్టార్ నాని( Natural Star Nani ) తాజాగా నటించిన చిత్రం దసరా( Dasara ).ఈ సినిమా మార్చి 30వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

 Actor Nani Sensational Comments About Dasara Movie,dasara,keerthy Suresh,natural-TeluguStop.com

సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాను చెరుకూరి సుధాకర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.శ్రీకాంత్ ఓదెల( Sreekanth Odela ) అనే నూతన దర్శకుడి దర్శకత్వంలో నాని కీర్తి సురేష్( Keerthy Suresh ) జంటగా నటించిన ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి హీరో నాని తాజాగా ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ సినిమాలో నాని డీ గ్లామర్ పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే.ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ పాటలు భారీ స్థాయిలో సినిమాపై అంచనాలను పెంచాయి.ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ దసరా( Dasara ) సినిమా కోసం తాను ప్రాణం పెట్టి పని చేశానని తెలిపారు.

ఈ సినిమా తర్వాత నా కెరియర్ ఏ స్థాయిలో ఉంటుంది అనే విషయం నాకు తెలియదు కానీ ఈ సినిమా ప్రాణం పెట్టి పని చేశానని తాను ఇమేజ్ ను పెంచుకోవాలని కాపాడుకోవాలని ఎప్పుడూ కూడా సినిమాలు చేయలేదని తెలిపారు.ఎప్పుడు కూడా నా మనసుకు నచ్చిన సినిమాలను చేసుకుంటూ పోతున్నానని ఈ సందర్భంగా నాని దసరా సినిమా గురించి తెలిపారు.ఇక డైరెక్టర్ శ్రీకాంత్ ఈ సినిమా ద్వారా మాకు కొత్త ప్రపంచాన్ని చూపించారని నాని తెలిపారు.ఇక ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం తెలంగాణలోని వీర్లపల్లి ప్రాంతం లో జరిగిందని ఆ ప్రాంత వాసులందరూ సెలబ్రేట్ చేసుకునే సినిమానే దసరా అంటూ ఈ సందర్భంగా నాని చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Video : Actor Nani Sensational Comments About Dasara Movie,Dasara,Keerthy Suresh,Natural Star Nani,Sreekanth Odela,De Glamor Role #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube