బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్న నందు..!  

actor nandhu says movie is blockbuster hero nandhu, acnher rashmi, cinima poster,teaser, song - Telugu Song, Teaser

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లేడీ సింగర్ గీతామాధురి భర్త యాక్టర్ నందు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాడు.ఇకపోతే అయిన గత సంవత్సరం సవారీ చిత్రంతో హీరోగా మారి తన నటనా ప్రదర్శనను చూపించారు.

TeluguStop.com - Actor Nandhu Says Movie Is Blockbuster

అయితే ఆ చిత్రం అనుకున్నంత విజయం సాధించకపోవడంతో కాస్త డీలా పడ్డాడు.అయితే ఎక్కడ తగ్గేది లేదంటూ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ఆయన మరో సినిమాతో ముందుకు వస్తున్నాడు.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే…

TeluguStop.com - బొమ్మ బ్లాక్ బస్టర్ అంటున్న నందు..-General-Telugu-Telugu Tollywood Photo Image

హీరో నందు ” బ్లాక్ బాస్టర్” అంటూ మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయిపోతున్నారు.ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి తాజాగా డిఫరెంట్ గా ఆలోచించి పోస్టర్ ను రిలీజ్ చేశారు.

ఇక ఈ మూవీ టైటిల్ పోస్టర్ లో ప్రతి ఒక్కటి కాస్త డిఫరెంట్ గా ఆలోచించి అందుకు తగ్గట్టుగా డిజైన్ చేసి విడుదల చేశారు.ఇకపోతే ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ భాగంగా బిబి అంటూ సందడి చేస్తున్న సమయంలోనే తాజాగా తన సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ గురించి కూడా నందు ప్రచారం చేస్తూ ఉన్నారు.

ఈ విధంగా కూడా నందు స్ట్రాటజీ బాగా వర్కవుట్ అవుతోంది.ఇప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులందరికీ బొమ్మ బ్లాక్ బాస్టర్ అనే సినిమా ఉన్నట్లు అర్థమవుతోంది.

ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒక టీజర్ కూడా రిలీజ్ చేశారు.అది కూడా తెలుగు ఆడియన్స్ కి బాగా చేరుకుంది.

ఇకపోతే ఈ సినిమాలో పోతురాజు క్యారెక్టర్ లో హీరో నందు, వాణి పాత్ర లో యాంకర్ రష్మీ నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ లో గొడవలు అంటే చాలా ఇష్టం అని అంటూ వయ్యారాలు ఒలకబోస్తూ డైలాగ్ చెప్పింది యాంకర్ రష్మీ.

అది టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంది.ఇకపోతే తాజాగా ఈ చిత్రం నుండి “ఫస్ట్ సింగిల్ రాయే రాయే ” అనే పాట రాబోతున్నట్లు పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం.

ఈ పోస్టర్ చూస్తే రష్మికి నందు గాఢంగా ముద్దు పెడుతున్నాడు.అలాగే రష్మీ నందు తాగే మందులో నీళ్లు కలుపుతోంది.ఈ పోస్టు చుస్తే నందు అంత లక్కీ ఫెలో ఇంకొకరు లేరు అన్నట్టుగా కనబడుతోంది.

#Teaser #Song

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actor Nandhu Says Movie Is Blockbuster Related Telugu News,Photos/Pics,Images..