టాలీవుడ్ ( Tollywood )హీరో మన్మధుడు నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఇటీవల కాలంలో నాగార్జున సినిమాల విషయంలో జోరుని కాస్త తగ్గించిన విషయం తెలిసిందే.
ఈ వయసులో కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ దూసుకుపోతున్నారు నాగార్జున( Nagarjuna) .ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో ఒక వార్త చెక్కర్లు కొడుతోంది.అదేమిటంటే టాలీవుడ్ లో హీరోలు ఎంతమందైనా ఉండొచ్చు కానీ వాళ్లందరితో పోలిస్తే నాగ్ స్పెషల్ స్పెషలట.ఎందుకో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అక్కినేని వారసుడిగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున తన అందంతో మన్మధుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు.కానీ నాగ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో కెరీర్ ప్రారంభంలో చాలా అవమానాలు ఎదుర్కొన్నాడు.నాగ్ రూపం హీరోగా పనికిరాదని, వాయిస్ అస్సలు బాగోలేదనే విమర్శలు వినిపించాయి.కానీ కొన్ని చిత్రాలకే వాటి గురించి మర్చిపోయి, తన యాక్టింగ్ గురించి మాట్లాడుకునేలా చేశాడు నాగ్.
మాములుగా హీరోస్ ఎక్కువగా ఒకటి లేదా రెండు జానర్ సినిమాలలో మాత్రమే నటిస్తూ ఉంటారు.కానీ హీరో నాగార్జున మాత్రం అన్ని రకాల నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అన్ని జానర్ సినిమాలో నాగ్ ట్రై చేసినట్లు మరే హీరో ట్రై చేయలేదని చెప్పవచ్చు.చాలామంది హీరోలకు ఒకే వయసొచ్చాక రొమాంటిక్ సీన్స్ చేయడం తగ్గించేస్తారు.కానీ నాగ్ మాత్రం తన ఏజ్ తో సంబంధం లేకుండా రొమాన్స్ చేస్తుంటాడు.అతడి లాస్ట్ మూవీ ఘోస్ట్ మూవీలో హీరోయిన్ సోనాల్ చౌహాన్ తో లిప్ లాక్ సన్నివేశాల్లోనూ యాక్ట్ చేశాడు ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు ఆఫ్ స్క్రీన్‌లోనూ తన ఫ్లర్టింగ్ స్కిల్స్ అప్పుడప్పుడు చూపిస్తుంటారు.
చాలామంది హీరోలకు దక్కని అదృష్టం మనం మూవీ తో నాగ్ సాధ్యం చేశాడు.తండ్రి కొడుకులతో( Father with sons ) కలిసి నటించిన నటుడిగా రికార్డ్ సృష్టించాడు.
ఇందులో తండ్రి ఏఎన్నార్, కొడుకులు నాగచైతన్య-అఖిల్ నటించారు.ఈ సినిమా తెలుగులో వచ్చిన బెస్ట్ మల్టీస్టారర్ చిత్రాల్లో ఒకటిగా నిలవడం విశేషం.
అలానే తండ్రి సినిమాల్లో నటించిన హీరోయిన్లతోనూ సినిమాలు చేసిన ఘనత నాగ్‌కి మాత్రమే సాధ్యమైంది.అప్పట్లో నాగార్జున చాలా హిందీ సినిమాల్లో నటించారు.
అలాగే తెలుగు సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.