తృటిలో ప్రమాదం తప్పించుకున్న సూపర్‌స్టార్‌

మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌కు పెను ప్రమాదం తప్పింది.ఈయన ప్రయాణిస్తున్న కారును పెద్ద ట్యాంకర్‌ ఢీ కొట్టబోయింది.

 Actor Mohanlal Escapes Car Accident-TeluguStop.com

అయితే డ్రైవర్‌ చాకచక్యంతో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందట.మలయాతూర్‌లో ఈ ప్రమాదం జరిగింది.

షూటింగ్‌కు హాజరు అయ్యి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని, కారుకు కొద్ది పాటి డ్యామేజ్‌ అయ్యిందని, మోహన్‌లాల్‌ మరియు డ్రైవర్‌లకు ఎలాంటి ప్రమాదం జరగలేదని అక్కడి మీడియా చెప్పుకొచ్చింది.ఈ ప్రమాద వార్త తెలిసిన వెంటనే ఆయన అభిమానులు ఆందోళన చెందారు.

పలువురు స్టార్స్‌ ఆయన యోగ క్షేమాలు అడిగి తొసుకున్నారు.ప్రస్తుతం మోహన్‌లాల్‌ యధాతథంగా షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.

త్వరలోనే మోహన్‌లాల్‌ తెలుగులో ఎన్టీఆర్‌ హీరోగా తెరకెక్కబోతున్న చిత్రంలో ముఖ్య పాత్రలో నటించబోతున్న విషయం తెల్సిందే.కొరటాల శివ ఆ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube