వైసీపిలోకి మోహన్ బాబు ఎంట్రీ షురూ..   Actor Mohan Babu Political Entry     2018-02-02   22:08:52  IST  Bhanu C

మోహన్ బాబు సినిమా ప్రపంచంలో అట్టడుగునుంచీ చిన్న చిన్న పత్రాలు వేస్తూ ఒక పెద్ద హీరో అయిన వ్యక్తుల్లో మోహన్ బాబు ఒకరు..మోహన్ బాబు కి సినిమా గురువు దాసరి నారాయణరావు..అయితే ఇప్పుడు తన గురువు బాటలోనే మోహన్ బాబు రాజకీయాల్లోకి దిగుతున్నారు.. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్‌బాబు క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు సర్వం సిద్దం చేసుకున్నారు…ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మోహన్ బాబు.తానూ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్నాని తెలిపారు..వచ్చే ఎన్నికల్లో నేను తప్పకుండ పోటీ చేస్తానని తెలిపారు మోహన్ బాబు..

అయితే మీరు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు అనే ప్రశ్నకి బదులుగా..ప్రజలకి వాస్తవాలు చెప్పాలి..ఆ భాద్యత నాపై ఎంతో ఉంది అయితే పోటీ చేసేవాళ్ళు నిజాలు చెప్పారు అనే ఉద్దేశ్యం ప్రజలలో ఉంటుదని అయితే నేను నిజం చెప్తున్నానా అబద్దం చెప్తున్నానా అనే విషయం మాత్రం ప్రజలు నిర్ణయిస్తారు నేను ఏమిటో ప్రజలకి తెలుసు అని తెలిపారు మోహన్ బాబు..అయితే మీరు వైసీపి తరుపున శ్రీకాళహస్తి ,లేదా వేంకటగిరిల నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఉందని అంటున్నారు అని అన్న ప్రశ్నకి మోహన్ బాబు తనదైన స్టైల్ లో సమాధానం చెప్పారు..

నేను ఏ పార్టీలోకి వెళ్తాను ఎక్కడ నుంచీ పోటీ చేస్తాను అనేది ఇప్పుడే చెప్పలేనని..సమయం వచ్చినప్పుడు తప్పకుండ చెప్తానని అన్నారు మోహన్ బాబు..అయితే రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న సమాచారం మేరకు..మోహన్ బాబు వైసీపి లోకి వెళ్తారని తెలుస్తోంది..ఎందుకంటే చంద్రబాబు తో మోహన్ బాబు కి ఈ మధ్య కాలంలో సఖ్యత లేదు..అంతేకాక జగన్ మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు దెగ్గర బంధువు కావడం..ఎక్కువగా మోహన్ బాబు జగన్ తో టచ్ లో ఉండటంతో మోహన్ బాబు పొలిటికల్ ఎంట్రీ వైసీపి నుంచీ అని ఫిక్స్ అవుతున్నారు..అయితే ఈ విషయం మోహన్ బాబు స్వయంగా చెప్పే వరకూ ప్రస్తుతానికి ఇది సస్పెన్స్ అనే చెప్పాలి..