నటులము కాకపోయి ఉంటే జీవితంలో అలా స్థిరపడే వాళ్ళం: మంజుల నిరుపమ్

తెలుగు బుల్లితెర పై ఎన్నో సీరియల్స్ లో జంటగా నటించి, నిజజీవితంలో కూడా భార్య భర్తలగా స్థిరపడి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్న నటి నటులు మంజుల నిరుపమ్ గురించి అందరికీ సుపరిచితమే.ముఖ్యంగా నిరుపమ్ కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి విశేషమైన ప్రేక్షకాదరణ పొందారు.

 Actor Manjula Nirupam Abou Their Career,nirupam Paritala, Manjula,karthika Deepa-TeluguStop.com

ప్రస్తుతం ఈ కార్యక్రమం నుంచి దూరమైన డాక్టర్ బాబు తన భార్య మంజులతో కలిసి యూట్యూబ్ వీడియోలు చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ సందర్భంగా తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా నెటిజన్లు అడిగే ప్రశ్నలకు పెద్దఎత్తున సమాధానాలు చెబుతూ అభిమానులను సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎన్నో రకాల ప్రశ్నలు అడగగా ఇద్దరు సమాధానాలు చెబుతూ వారి సందేహాలను వ్యక్తపరిచారు.ముఖ్యంగా డాక్టర్ బాబు కార్తీకదీపం రీ-ఎంట్రీ గురించి చాలామంది ప్రశ్నలు అడిగారు.

ఈ ప్రశ్న అడగటంతోనే నిరుపమ్ లేనిలోటు స్పష్టంగా కనబడుతుందని చెప్పాలి.ఇకపోతే తాజాగా నెటిజన్లు ఈ దంపతులను ప్రశ్నిస్తూ.

ఒకవేళ మీరు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వక పోయి ఉంటే ఏం చేసే వాళ్ళని ప్రశ్న అడిగారు.

Telugu Karthika Deepam, Manjula, Nirupam Manjula, Serial Actors, Tollywood, Yout

ఈ ప్రశ్నకు డాక్టర్ బాబు సమాధానం చెబుతూ ఇంకేం చేస్తాం చదివాం కదా బీటెక్ ఎలాగోలాగా ఎవరో ఒకరిని బ్యాక్ డోర్‌లో పట్టుకుని జాబ్ చేసే వాడిని లేదంటే ఏదైనా కోర్సు చేస్తూ ఉదయం 9 నుంచి 5 వరకు ఉద్యోగం చేస్తూ ఇంటికి వచ్చేవాన్ని.అయితే తనకు ఎప్పుడూ కూడా ఉద్యోగం చేయాలనే ఆలోచన రాలేదని ఈ సందర్భంగా తెలిపారు.ఇక మంజుల సైతం చార్టెడ్ అకౌంటెంట్ చేయాలని భావించారు,కాకపోతే తన నటన వైపు రావడం వల్ల ఆ కోర్సు పూర్తి చేయలేక పోయారని,నటనపై ఆసక్తి రావడంతో ఇక ఇతర విషయాల గురించి ఆలోచించకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అలా సెటిల్ అయ్యామని, ఒకవేళ ఇండస్ట్రీలోకి రాకపోయి ఉంటే ఇద్దరం ఏదైనా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం అంటూ సమాధానం చెప్పారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube