సైదాబాద్ చిన్నారి ఘటనపై స్పందించిన మహేష్ బాబు.. మన పిల్లలు ఎలా బతుకుతారు ఇలాంటి సమాజంలో?

అభం శుభం తెలియని ఆరేళ్ల చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడి అత్యంత క్రూరంగా హత్యచేశాడు.మనసును కలచివేసే అత్యంత దారుణమైన ఈ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

 Actor Mahesh Babu Response On Sadabad Rape Case Issue Emotional Tweet-TeluguStop.com

సింగరేణి కాలనీలో గురువారం రాత్రి జరిగిన ఈ సంఘటనలో.ఆ సాయంత్రం నుంచి కనిపించకుండా పోయిన చిన్నారి కోసం తల్లిదండ్రులు రెండు గంటల పాటు వెతికారు.

అప్పటికీ పాప ఆచూకీ లభించకపోవడంతో అనుమానం వచ్చి పక్కనే ఉన్న ఇంటి తలుపులు తీయగా విగతజీవిగా పడి ఉన్న చిన్నారిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు.

 Actor Mahesh Babu Response On Sadabad Rape Case Issue Emotional Tweet-సైదాబాద్ చిన్నారి ఘటనపై స్పందించిన మహేష్ బాబు.. మన పిల్లలు ఎలా బతుకుతారు ఇలాంటి సమాజంలో-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు నల్లగొండ జిల్లా చందంపేట్ మండలానికి చెందిన రాజు నాయక్ కొన్నేళ్ల కిందటే పొట్టకూటికోసం భార్యతో కలిసి హైదరాబాద్ కి వచ్చాడు.

సింగరేణి కాలనీలో ఉంటూ ఆటో నడిపే రాజు చెడు వ్యసనాలకు బానిసగా మారి చిల్లర దొంగతనాలకు పాల్పడేవాడు.భార్యను వేధింపులకు గురిచేసి ఇంటి నుంచి వెళ్లగొట్టిన కొద్ది రోజుల నుంచి జులాయిగా తిరుగుతున్నాడు.

గురువారం సాయంత్రం కాలనీలోని ఆరేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పి తన ఇంటికి తీసుకెళ్లాడని పోలీసులు తెలిపారు.

అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, దారుణంగా చంపేసిన ఆ వ్యక్తిని తమకు అప్పగించే దాకా.

చిన్నారి మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళేది లేదని… బస్తీ వాసులంతా పట్టుపట్టి కూర్చున్నారు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఆందోళన చేస్తున్న స్థానికులను శాంతింప జేశారు.

ఇదిలా ఉండగా ఈ ఘటనపై స్పందించిన సమస్త ప్రజానీకం ఆ నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు.భాగ్య నగరాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిన ఈ ఘటనపై పలు విమర్శలు కూడా చోటు చేసుకుంటున్నాయి.సమాజం కల్లుగప్పి తిరుగుతున్న ఆ నీచ మృగాన్ని ఇప్పటికే పెద్ద ఎత్తున గాలింపు కొనసాగుతోంది.ఇందులో భాగంగానే .నిందితుని ఆచూకీ తెలియజేసిన వారికి రూ.10 లక్షల రివార్డ్ ను కూడా ఇప్పటికే పోలీసులు ప్రకటించారు.

ఈ దారుణ సంఘటనపై సినీ, రాజకీయ ప్రముఖులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇటీవలే నటుడు మంచు మనోజ్ చిన్నారి కుటుంబాన్ని పరామర్శించారు.ఇకపోతే తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ఈ విషయంపై స్పందించారు.భావోద్వేగానికి గురయిన ఆయన సొసైటీలో అడుగంటి పోతున్న నైతిక విలువలను ట్విట్టర్ వేదికగా సంధించారు.

ఈ సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ… హైదరాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన దారుణమైన ఘటన.సమాజంలో పడిపోతున్న విలువలకు తార్కాణంగా నిలుస్తోందని ఆయన అన్నారు.ఇలాంటి సొసైటీలో మన పిల్లలు సురక్షితంగా ఎలా ఉంటారని మహేశ్ ప్రశ్నించారు.ఆ కుటుంబం ఈ బాధను ఎలాతట్టుకుంటుందో ఊహించుకోవడానికే కష్టంగా ఉందని ఆయన అన్నారు.అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకొని… ఆ చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నానంటూ… మహేశ్ బాబు ట్వీట్ చేశారు.

సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ ఘటనపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి.

నిందితున్ని వెంటనే పట్టుకొని అందరూ చూస్తుండగానే ఎన్కౌంటర్ చేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు.

#Raju Naik #Manchu Manoj #Sadabad #Mahesh Babu #Reward

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు