అదంతా జుట్టుకు వేసుకున్న కలర్ మహిమ అంటున్న మాధవన్..!

భారతదేశంలో హీరో మాధవన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఒకే సినిమా భాష అని కాకుండా భారతదేశంలో ఉన్న అన్ని రకాల సినీ ఇండస్ట్రీలలో ఆయన తన ప్రతిభా పాటవాన్ని చూపించారు.

 Actor Madhavan Amazing Reply To Netizen, Miracle Of Good Dye, Madhavan, Glory O-TeluguStop.com

ఎన్నో రకరకాల విభిన్న పాత్రలు వేస్తూ తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరుచుకున్న వ్యక్తి మాధవన్.ఇకపోతే తాజాగా ఆయన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.అయితే ఆ ఫోటోను ఆయన వీరాభిమాని ఒకరు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.‘మాధవన్ కు రోజులు గడిచే కొద్దీ కొద్ది.వయసు తగ్గుతుంది.కానీ పెరగడం లేదు’ అంటూ తెలిపాడు.అయితే అభిమాని అలా ప్రస్తావించిగా దానికి తాజాగా మాధవన్ స్పందించాడు.

ఆ ఫోటో ని ఉద్దేశించి మాధవన్ తన జుట్టుకు వేసుకున్న రంగే అంటూ అని సరదాగా సమాధానం తెలిపాడు.

దీంతో మాధవన్ పై నెటిజెన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.నిజాన్ని ఒప్పుకోవడం అంత సులువు కాదని.ఇలా చెప్పడంతో ఆయన గొప్పతనాన్ని పొగిడేస్తున్నారు నెటిజెన్స్.కొంతమంది నెటిజన్స్ అయితే అది మీ జుట్టుకు వేసుకున్న రంగు గొప్పతనం కాదని.

ఆ గొప్పతనం మీదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మధ్య కాలంలో ఓటిటి ఫ్లాట్ ఫామ్ ద్వారా విడుదలైన నిశ్శబ్దం సినిమాలో ఓ ప్రధాన పాత్రలో మాధవన్ అలరించాడు.

ఇకపోతే ప్రస్తుతం మాధవన్ తన తర్వాతి సినిమా చిత్రీకరణ నేపథ్యంలో ఆయన ఢిల్లీ నగరంలో ఉన్నారు.మలయాళంలో వచ్చిన చార్లిన్ చిత్రానికి తమిళ రీమేక్ గా ‘మారా’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమా డిసెంబర్ 17న ఓటిటి ఫ్లాట్ ఫామ్ వేదికగా విడుదల కానున్నట్లు సమాచారం.అయితే ఈ సినిమా ఇప్పటికే విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా ఆలస్యం అయ్యింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube