కొడుకును తెరపై చూసుకోవాలని ఆ నటుడిని తీసేసిన ఎన్టీఆర్.. ఏమైందంటే?

Actor Madala Ravi Interesting Comments About Senior Ntr

తెలుగు సినిమా నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో మాదాల రవి ఒకరు.ప్రముఖ విప్లవ నటుడైన మాదాల రంగారావు తనయుడు అయిన మాదాల రవి తండ్రి ప్రొడ్యూసర్ గా తెరకెక్కిన చాలా సినిమాలలో బాలనటుడిగా నటించారు.

 Actor Madala Ravi Interesting Comments About Senior Ntr-TeluguStop.com

నేను సైతం సినిమాలో మాదాల రవి హీరోగా కూడా నటించారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాదాల రవి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

మా తాతలు ఎన్జీ రంగా బెస్ట్ ఫ్రెండ్స్ అని మాదాల రవి అన్నారు.నాన్న ముందు నాటకాలు చేశారని మాదాల రవి వెల్లడించారు.

 Actor Madala Ravi Interesting Comments About Senior Ntr-కొడుకును తెరపై చూసుకోవాలని ఆ నటుడిని తీసేసిన ఎన్టీఆర్.. ఏమైందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వామపక్ష ఉద్యమాల్లో ఉండేవాళ్లు పవర్ లో ఉన్నవాళ్లను విమర్శించాల్సి ఉంటుందని మాదాల రవి అన్నారు.వామపక్ష పార్టీలలో ఉండేవాళ్లకు ప్రెజర్ ఎక్కువగా ఉంటుందని మాదాల రవి చెప్పుకొచ్చారు.

నాన్న ప్రజల సమస్యలపైనే ఎక్కువగా సినిమాలను తెరకెక్కించారని మాదాల రవి అన్నారు.

తన తండ్రి సినిమాల సెన్సార్ సర్టిఫికెట్ల కోసం యుద్ధాలు జరిగాయని మాదాల రవి పేర్కొన్నారు.

విప్లవ శంకం సినిమాను బ్యాన్ చేస్తే నాన్న ఆమరణ నిరాహార దీక్ష చేశారని మాదాల రవి అన్నారు.నాన్నగారికి సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా అభిమానమని దానవీర శూరకర్ణలో నాన్నను అర్జునుడి పాత్ర కోసం ఎంపిక చేశారని ఆ సినిమా కోసం నాన్న 7 నెలలు సీనియర్ ఎన్టీఆర్ తో ట్రావెల్ అయ్యారని మాదాల రవి తెలిపారు.

ఆ తర్వాత సీనియర్ ఎన్టీఆర్ తన కొడుకును అర్జునుని పాత్రలో చూడాలని భావించి నాన్నను తీసేశారని మాదాల రవి పేర్కొన్నారు.నాన్న గారి బ్యానర్ ను డిస్టర్బ్ చేయకూడదని భావించి భారత్ ప్రొడక్షన్స్ అని సొంత బ్యానర్ ను స్టార్ట్ చేశానని మాదాల రవి వెల్లడించారు.క్రిష్, కొరటాల శివ వామపక్ష భావాలతో ఉన్న సందేశాత్మక సినిమాలను తీస్తున్నారని మాదాల రవి అన్నారు.

#Madala Ravi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube