ఏపీ హైకోర్టుని ఆశ్రయించిన కృష్ణంరాజు  

Actor Krishnam Raju files petition in AP High Court, Amaravati, AP Politics, AP Government, Gannavaram Air Port, Land Issue, Actor Krishnam Raju , Producer Aswini dutt - Telugu Actor Krishnam Raju, Actor Krishnam Raju Files Petition In Ap High Court, Amaravati, Ap Government, Ap Politics, Gannavaram Air Port, Land Issue, Producer Aswini Dutt

ఏపీ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన తర్వాత ప్రస్తుత రాజధానిగా ఉన్న అమరావతిలో భూముల ధరలు దారుణంగా పడిపోయాయి. అమరావతి రాజధానిగా ఉండదు అనే విషయం ఇప్పుడు అందరికి క్లారిటీ వచ్చేయడంతో అక్కడ పెట్టుబడులు పెట్టిన వారు ఇప్పుడు లబోదిబోమని అంటున్నారు.

TeluguStop.com - Actor Krishnam Raju Files Petition In Ap High Court

చంద్రబాబుని నమ్మి పూర్తిగా మోసపోయామని అభిప్రాయ పడుతున్నారు.ఇదిలా ఉంటే ఇప్పుడు ఇలా భూముల వ్యవహారంలో కొంత మంది హైకోర్టుని ఆశ్రయిస్తున్నారు.

తాజాగా టాలీవుడ్ సీనియర్ నటుడు, బీజేపీ నేత కృష్ణంరాజు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.గన్నవరం వద్ద ఎయిర్ పోర్టు విస్తరణలో తమకు చెందిన 31 ఎకరాల భూమికి సరైన నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ ఆయన న్యాయస్థానాన్ని కోరారు.

TeluguStop.com - ఏపీ హైకోర్టుని ఆశ్రయించిన కృష్ణంరాజు-General-Telugu-Telugu Tollywood Photo Image

తమ పొలంలో ఉన్న పంటలు, నిర్మాణాల విలువను పరిగణనలోకి తీసుకుని నష్ట పరిహారం చెల్లించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.కృష్ణంరాజు పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ వ్యవహారంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

మరోవైపు నిర్మాత అశ్వనీదత్ కూడా హైకోర్టును ఆశ్రయించారు.గన్నవరం ఎయిర్ పోర్ట్ వద్ద తనకున్న 39 ఎకరాలకు సరైన నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.గన్నవరం వద్ద ఆ భూమి ఎకరం 1.54 కోట్ల మేర విలువ ఉందని, ఆ భూమికి సమాన విలువ కలిగిన భూమిని అమరావతిలో ఇస్తామని నాటి ప్రభుత్వం సీఆర్డీఏ ఒప్పందం చేసుకుందని అశ్వనీదత్ పిటిషన్ లో వివరించారు.అయితే రాజధానిని ప్రభుత్వం అక్కడి నుంచి తరలించాలని చూడడంతో అమరావతిలో భూమి విలువ ఎకరం 30 లక్షలకి  పడిపోయిందని, ఈ పరిస్థితిలో గన్నవరంలో తన భూమికి తగ్గ విలువతో నష్టపరిహారం ఇవ్వాలని కోరారు.మరి ఈ పిటీషన్ లపై ఏపీ ప్రభుత్వం రియాక్షన్ ఎలా ఉంటుందో, హై కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో అనేది చూడాలి.

#Amaravati #AP Government #Land Issue #ActorKrishnam #ActorKrishnam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actor Krishnam Raju Files Petition In Ap High Court Related Telugu News,Photos/Pics,Images..