టీవీ ఈవెంట్స్ కి పిలిచి అస్సలు మర్యాద ఇవ్వరు.. టీవీ నటుడు కౌశిక్!

Actor Krishna Kaushik Sensational Comments On Events In Etv And Maa Tv

తాను ఈ రోజు ఇలా ఉన్నానంటే కారణం ఈటీవీనే అని ప్రముఖ సీరియల్ నటుడు శ్రీ కృష్ణ కౌశిక్ తెలిపారు.మామూలుగా ఈనాడు పేపర్‌లో పాస్‌ ఫొటో సైజ్ ఫొటో వేయాలంటే 5వేలు అవుతుందన్న ఆయన, వాళ్లు ప్రతీ సీరియల్‌కి తన ఫొటోను వసుంధర పేజీ వెనకాల వేసేవారని ఆయన అన్నారు.

 Actor Krishna Kaushik Sensational Comments On Events In Etv And Maa Tv-TeluguStop.com

అంటే వాళ్లకు తాను ఎప్పుడూ టచ్‌లో ఉండేవాడినని ఆయన తెలిపారు.అపుడు యూట్యూబ్ లాంటి సోషల్ మీడియా లేని కాలంలోనే ఈనాడు చాలా పెద్దది.

ఇప్పటికీ కూడా అది పెద్ద పేపరే.అలాంటి పేపర్‌లో సినిమా పేజీలో వెనకాల పోస్ట్ కార్డ్ సైజ్‌లో సీరియల్స్ ఫొటోలు పడేవని, అందులో ప్రతి రోజూ తన ఫొటో ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు.

 Actor Krishna Kaushik Sensational Comments On Events In Etv And Maa Tv-టీవీ ఈవెంట్స్ కి పిలిచి అస్సలు మర్యాద ఇవ్వరు.. టీవీ నటుడు కౌశిక్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ పేపర్ కటింగ్స్‌ను తాను దాచుకున్నాను కూడా అంటూ ఆయన వివరించారు.నిజానికి అంత పబ్లిసిటీ ఎవరిస్తారు ? కానీ ఒక ఆర్టిస్ట్‌గా వాళ్లు తనను అంతగా ఆదరించారని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

కానీ ఆ తర్వాత జరిగిన సంఘటనతో మనం అనుకున్నది కరెక్టే, పెద్ద వాళ్లతో వద్దు.మన స్నేహం మన స్థాయి వాళ్లతోనే చేయాలని ఆయన అన్నారు.ఆ తర్వాత జెమిని ఛానెల్‌లో చేసిన దేవత సీరియల్ తనను ఎక్కడికో తీసుకెళ్లిందని ఆయన చెప్పారు.ఆర్టిస్ట్‌గా తన ఇమేజ్‌ను పెంచిందని ఆయన అన్నారు.

అంత మంచి సీరియల్లో నటించినా తనకు అంతగా బ్రేక్‌ రాలేదని శ్రీ కృష్ణ కౌశిక్ అన్నారు.ఒక కళాకారుడిగా ఒక గుర్తింపు ఉండాలనుకుంటానని ఆయన అన్నారు.గుర్తింపు అంటే అవార్డు కాదన్న ఆయన, వాల్యూ ఇవ్వాలని తాను కోరుకుంటానని చెప్పారు.ఇప్పటికీ తనకు అది దక్కలేదని తాను ఫీలవుతున్నట్టు ఆయన తెలిపారు.

తనను అన్ని ఛానెళ్ల వాళ్లూ అంటే, ఈటీవీ, మాటీవీ, జీ . ఇలా అందరూ తనని షోస్‌కి పిలుస్తారన్న ఆయన, అక్కడ వాళ్లు తనకు అంత వాల్యూ ఇవ్వరేమోనని తన ఫీలింగ్ అని ఆయన చెప్పుకొచ్చారు.అంటే తాను అంత పెద్ద స్టార్‌ని కాకపోయినా, తాను సంపాదించిన ప్రొఫైల్‌కి అంత విలువ ఇవ్వనట్టు తనకు అనిపిస్తుందని ఆయన వెల్లడించారు.అది తనకు బాధగా ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

#Krishna Kaushik #Etv Maa Tv #Kaushik

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube