రాఘవేంద్రరావు ఆర్టిస్టుని పువ్వులా చూసుకుంటారు.. కోట కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ డైరెక్టర్లలో కె.రాఘవేంద్రరావు కూడా ఒకరు.100కు పైగా సినిమాలకు రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా ఆ సినిమాలలో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించి నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించాయి.దర్శకుడిగా రాఘవేంద్రరావు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు.

 Actor Kota Sreenivasarao Interesting Comments About Raghavendra Rao, Engineers, Kota Sreenivasaro, Mass People, Raghavendra Rao-TeluguStop.com

విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ లను టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు రాఘవేంద్రరావు కావడం గమనార్హం.

ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు రాఘవేంద్రరావు గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Actor Kota Sreenivasarao Interesting Comments About Raghavendra Rao, Engineers, Kota Sreenivasaro, Mass People, Raghavendra Rao-రాఘవేంద్రరావు ఆర్టిస్టుని పువ్వులా చూసుకుంటారు.. కోట కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాఘవేంద్రరావు డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో ఎక్కువ సినిమాలలో తాను నటించలేదని అయినప్పటికీ రాఘవేంద్రరావుపై ప్రేమ, గౌరవం మాత్రం తనకు అలాగే ఉన్నాయని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.ఒకసారి తాను గోదావరి ఎక్స్ ప్రెస్ లో వెళ్లే సమయంలో అదే రైలులో రాఘవేంద్రరావు గారు కూడా ఉన్నారని తనకు తెలిసిందని తాను వెంటనే వెళ్లి కలిశానని కోట అన్నారు.

ఆయన ట్రైన్ లో ఏదో ఫంక్షన్ కు వెళుతున్నారని ఆయన బోగీలో డాక్టర్లు, ఇంజినీర్లు ఎక్కువగా ఉన్నారని తాను వెళ్లి నమస్కారం పెట్టిన వెంటనే రాఘవేంద్రరావు లోపలికి రా కూర్చో అంటూ ప్రేమగా ఆహ్వానించారని అక్కడ ఉన్నవాళ్లు సైతం నాతో ఆప్యాయంగా మాట్లాడారని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.రాఘవేంద్రరావు ఆర్టిస్టును పువ్వులా చూసుకుంటారని కోట శ్రీనివాసరావు తెలిపారు.

Telugu Engineers, Mass, Raghavendra Rao-Movie

రాఘవేంద్రరావు నాకు మాస్ జనాలతో పాటు చదువుకున్నవాళ్లలో కూడా చాలామంది అభిమానులు ఉన్నారని చెప్పారని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.అవతలివాళ్ల అవకతవకలను రాఘవేంద్రరావు అస్సలు పట్టించుకోరని ఇతరుల మంచి గురించి మాత్రమే అయన ఆలోచిస్తారు కాబట్టే ఆయన సెట్లో ఉన్నవాళ్లంతా ఆనందంగా ఉంటారని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.కోట శ్రీనివాసరావు చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube