పవన్ కళ్యాణ్ అలా అనగానే కళ్లలో నీళ్లు వచ్చాయి.. కోట కామెంట్స్ వైరల్!

తెలుగులో దశాబ్దాల నుంచి ఎన్నో విలక్షణమైన పాత్రలలో నటిస్తూ విజయాలను అందుకుంటున్న నటుడిగా కోట శ్రీనివాసరావుకు పేరుంది.కోట శ్రీనివాసరావు నటించిన సినిమాలలో జులాయి ఒకటి కాగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Actor Kota Sreenivasarao Interesting Comments About Pawan Kalyan , Interesting C-TeluguStop.com

రిషికిండ నుంచి భీమిలికి వెళ్లే రూట్ అంటూ ఆ సినిమాలో డైలాగ్ ఉంటుందని అలాంటి డైలాగ్ రాయాలంటే భాష మీద పట్టుతో పాటు లోకజ్ఞానం ఉండాలని కోట శ్రీనివాసరావు తెలిపారు.

లోకజ్ఞానం ఉంటే తప్ప ఇలాంటి డైలాగ్స్ ను రాయడం తేలిక కాదని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.

జులాయి సినిమాలో డైలాగ్స్ అద్భుతంగా రాశారని త్రివిక్రమ్ కు చెబితే తాను డైలాగ్స్ మాత్రమే రాశానని ఎక్స్ ప్రెషన్లు, ఎక్స్ ట్రా సౌండ్లతో ఆ పాత్రకు ప్రాణం పోశారని త్రివిక్రమ్ అన్నాడని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో అత్తారింటికి దారేది సక్సెస్ మీట్ జరిగిందని కోట శ్రీనివాసరావు తెలిపారు.

భారీ ఎత్తున జరిగిన ఆ వేడుకకు యూనిట్ సభ్యులంతా హాజరయ్యామని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.ఆ వేడుకలో పవన్ కళ్యాణ్ తన గురించి మాట్లాడుతూ కోట శ్రీనివాసరావు గారు పెద్దవారని కోట శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే తన వయస్సు కానీ, అనుభవం కానీ సరిపోదని పవన్ అన్నారని కోట శ్రీనివాసరావు తెలిపారు.

పవన్ అలా చెప్పడంతో తన కళ్ల నుంచి నీళ్లు కారాయని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.

Telugu Pawan Kalyan-Movie

ఒక వేదికపై తన కళ్లు చెమర్చడం అదే తొలిసారి అని కోట శ్రీనివాసరావు అన్నారు.ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ తన గురించి పాజిటివ్ గా చెప్పడం గొప్పగా అనిపించిందని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.త్రివిక్రమ్ సినిమాలలో తాను ఆర్టిస్ట్ గా చేయగలిగే సత్తా ఉన్న పాత్రలలో నటించానని కోట శ్రీనివాసరావు అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube