నాన్న డబ్బులంటే ఆడపారేసి పోరా అనేవారు.. కోట ఆసక్తికర వ్యాఖ్యలు..?

వందల సంఖ్యలో సినిమాల్లో నటించి విలక్షణమైన పాత్రల ద్వారా నటుడిగా కోట శ్రీనివాసరావు మంచి పేరును సొంతం చేసుకున్నారు.చిన్నప్పటి నుంచే నాటకాలపై ఆసక్తి ఉన్న కోట శ్రీనివాసరావు రంగస్థల నటుడిగా గుర్తింపును సంపాదించుకున్నారు.

 Actor Kota Sreenivasarao Interesting Comments About His Father, Actor Kota Sreen-TeluguStop.com

తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల గురించి చెబుతూ కోట శ్రీనివాసరావు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.అమ్మ పేరు విశాలాక్షి అని అమ్మ నన్ను ఎంతో గారాబంగా చూసుకునేదని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

అమ్మ ఎంతో రుచిగా వంటలు చేసేదని కోట శ్రీనివాసరావు అన్నారు.బాల్యంలో తనకు ఇంట్లో ఏ పని చెప్పేవారు కాదని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.నాన్నకు కళలు అంటే ఎంతో ఇష్టం కావడంతో తాను నాటకాలు చూసి ఆలస్యంగా ఇంటికి వచ్చినా నాన్న ఏం అనేవారు కాదని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.నాన్న డాక్టర్ అని డబ్బులు అడగకుండా ఉచితంగా వైద్యం చేసేవారని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

ఎవరైనా వైద్యం చేయించుకుని డబ్బులు ఇస్తామని చెబితే ఆడపాడేసి పోరా అని నాన్న చెప్పేవారని కోట శ్రీనివాసరావు కామెంట్లు చేశారు.

Telugu Kotasrinivasa, Radha Master, Transils-Movie

ఇంటి బయట ఉండే నవారు మంచాలే ఆపరేషన్ థియేటర్లు అని నాన్న పిల్లలకు అక్కడ టాన్సిల్స్ ఆపరేషన్ చేసేవారని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.చిన్నప్పుడు తాను స్నేహితులతో కలిసి బిళ్లంగోడు, వాలీబాల్ ఆడుకునేవాడినని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.

Telugu Kotasrinivasa, Radha Master, Transils-Movie

చిన్నప్పుడు రాధా మాస్టార్ దగ్గర చదువు నేర్చుకున్నానని అక్కడ చదువు పూర్తైన తర్వాత పెద్దక్కయ్య వాళ్ల ఇంట్లో ఉండి చదువుకున్నానని వాళ్లకు ఏ ఊరు బదిలీ అయితే ఆ ఊరికి వెళ్లేవాడినని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.చాలామంది నన్ను డాక్టర్ చేస్తారా అని నాన్నను అడిగేవారని వాళ్లు ఎక్కువగా అలా అడగడంతో నాన్న నాపై ఆశలను పెంచుకున్నారని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube