హరీష్ శంకర్ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ ఇదే.. కోట కామెంట్స్ వైరల్!

Actor Kota Sreenivasarao Interesting Comments About Hareesh

కోట శ్రీనివాసరావు తన సినీ కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించగా కోట శ్రీనివాసరావు నటన వల్లే హిట్టైన సినిమాలు కూడా పదుల సంఖ్యలో ఉన్నాయి.గబ్బర్ సింగ్ సినిమాలో శృతిహాసన్ తండ్రి పాత్రలో నటించి కోట శ్రీనివాసరావు మెప్పించారు.

 Actor Kota Sreenivasarao Interesting Comments About Hareesh-TeluguStop.com

తాగుబోతు తండ్రి పాత్రలో నటించి కోట శ్రీనివాసరావు ఆ పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశారు.తాజాగా ఒక ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

హరీష్ శంకర్ మంచి రైటర్, డైరెక్టర్ అని లోకానికి తెలుసని అయితే తనకు చాలా సంవత్సరాల నుంచి హరీష్ శంకర్ తో పరిచయం ఉందని కోట శ్రీనివాసరావు అన్నారు.బీ.హెచ్.ఈ.ఎల్ లో హరీష్ శంకర్ వేసిన నాటకాలు చూశానని హరీష్ శంకర్ మంచి నటుడని తనకు మాత్రమే తెలిసిన విషయమని హరీష్ శంకర్ గురించి ప్రేక్షకులకు తెలియని విషయాన్ని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.హరీష్ శంకర్ నాటకాలు చూసిన సమయంలోనే అతను విషయం ఉన్న కుర్రాడని అర్థమైందని కోట శ్రీనివాసరావు తెలిపారు.

 Actor Kota Sreenivasarao Interesting Comments About Hareesh-హరీష్ శంకర్ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్ ఇదే.. కోట కామెంట్స్ వైరల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

హరీష్ శంకర్ పైకి వస్తాడని అప్పుడే అనుకున్నానని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.హరీష్ శంకర్ తనకు కొడుకులాంటి వ్యక్తి అని హరీష్ గబ్బర్ సింగ్ సినిమాలో తనతో పెద్ద ప్రయోగమే చేయించాడని కోట శ్రీనివాసరావు పేర్కొన్నారు.తాను డైలాగ్స్ చెబితే ఏ విధంగా ఉంటుందో తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితమే అని హరీష్ శంకర్ తనతో పాట పాడించి గొంతును ఫుల్ ప్లెడ్జ్ గా టాలీవుడ్ కు పరిచయం చేశాడని కోట శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

Telugu Gabbar Singh, Hareesh Shankar, Commnets, Tollywood-Movie

గబ్బర్ సింగ్ సినిమాలో తాను పాడిన మందుబాబులం పాటను తలచుకుంటే ఇప్పటికీ నవ్వు వస్తుందని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.దేవి శ్రీ ప్రసాద్, హరీష్ శంకర్ తనను పాట పాడాలని చెప్పిన సమయంలో జోక్ చేస్తున్నారని అనుకున్నానని అయితే నేచురల్ గా సెట్ అవుతుందని చెప్పి తనతో పాడించారని కోట శ్రీనివాసరావు వెల్లడించారు.

#Hareesh Shankar #Commnets #Gabbar Singh

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube