స్వల్ప అనారోగ్యం కారణంగా హస్పిటల్లో చేరిన సినీన‌టుడు క‌మ‌ల‌హాస‌న్.. !

ప్రముఖ విలక్షణ నటుడు కమల్ హసన్ స్వల్ప అనారోగ్యం కారణంగా హస్పిటల్లో చేరారట.ఇందులో అభిమానులు బయపడ వలసిన విషయం ఏం లేదట.

 Actor Kamal Haasan Has Been Admitted To Hospital Due To A Minor Illness, Actor,-TeluguStop.com

కుడి కాలు బోనుకి స్వ‌ల్ప‌ ఇన్ఫెక్ష‌న్ కార‌ణంగా క‌మ‌ల‌హాస‌న్ చెన్నైలోని శ్రీరామ‌చంద్ర మెడిక‌ల్ సెంట‌ర్ లో చేరార‌ని వైద్యులు వివ‌రించారు.

ఈ నేప‌థ్యంలో ఆ ఆసుప‌త్రి వర్గాలు క‌మ‌ల‌హాస‌న్ ఆరోగ్య ప‌రిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుద‌ల చేసింది.

కమల్ కుడి కాలు బోనుకి స్వ‌ల్ప‌ ఇన్ఫెక్ష‌న్ సోకడం వల్ల శ్రీరామ‌చంద్ర మెడిక‌ల్ సెంట‌ర్ లోని వైద్యులు కాలికి శస్త్ర‌ చికిత్స చేశారని.ప్ర‌స్తుతం ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

కాగా క‌మ‌ల‌హాస‌న్ కొన్ని నెల‌లుగా త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతోన్నక్రమంలో తన దృష్టినంతా ఈ ఎన్నికల పైనే పెట్టారు.ఇందులో భాగంగా ఇదివరకే ప‌లు ప్రాంతాల్లో ప్ర‌చార కార్య‌క్ర‌మాలు కూడా మొదలు పెట్టారు.

ఈ నేపధ్యంలో తనకు ముందు ముందు కాలు వల్ల ఇబ్బంది కలుగవద్దనే ఆలోచనతో ముందుగానే ఆ సమస్యను పరిష్కరించుకునే దిశగా ఈ సర్జరీ చేయించుకున్నారని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube