అరుదైన రికార్డును సాధించిన జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. డొనేట్ ఏ మీల్ అంటూ?

రెండు తెలుగు రాష్ట్రాల్లో మాస్ ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరనే సంగతి తెలిసిందే.ఇతర రాష్ట్రాల్లో, విదేశాల్లో కూడా తారక్ ను అమితంగా అభిమానించే ఫ్యాన్స్ అయితే ఉన్నారు.

 Actor Junior Ntr  Fans Rare Record Details Here Goes Viral  Junior Ntr, Ntr  Fan-TeluguStop.com

తాజాగా తారక్ అభిమానులు ఒక రికార్డును క్రియేట్ చేయగా ఆ రికార్డ్ నెట్టింట వైరల్ అవుతోంది.డొనేట్ ఏ మీల్ నినాదంతో ట్రస్ట్ ను ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ అభిమానులు ఆకలితో అలమటిస్తున్న వారి కోసం ఎంతో కష్టపడుతున్నారు.

5 రాష్ట్రాల్లోని 133 ప్రాంతాలలో ఎన్టీఆర్ అభిమానుల సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.తారక్ సేవా ట్రస్ట్ చేపట్టిన ఈ కార్యక్రమం ఎంతోమంది ఆకలిని తీర్చింది.

ఈ సేవా కార్యక్రమం మొదలై నేటికి 600 రోజులైంది.ఈ సేవా కార్యక్రమం ద్వారా తారక్ అభిమానులు తిండి లేని వాళ్లకు ఆహారం అందేలా చూస్తున్నారు.

తమ సంపాదనలో కొంత మొత్తాన్ని ఈ కార్యక్రమం కోసం ఖర్చు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఈ సేవా కార్యక్రమం మొదలు కాగా కరోనా కేసులు తగ్గినా ఈ కార్యక్రమం కొనసాగుతుండటం గమనార్హం.

ఇతర రాష్ట్రాలలో ఉన్న ఎన్టీఆర్ అభిమానులు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురయ్యేలా చేస్తున్నారు.డొనేట్ ఏ మీల్ నినాదం ద్వారా ప్రతి తారక్ అభిమాని తమకు వీలైన చోట వీలైనంత మంది ఆకలిని తీరుస్తూ ఉండటం గమనార్హం.

Telugu Days, Corona, Donate Meal, Fans, Ntr, Ntr Fans, Rare, Programs, Tarak Sev

ఎన్టీఆర్ అభిమానులు చేస్తున్న సేవా కార్యక్రమాలను ఇతర హీరోల అభిమానులు సైతం తెగ ప్రశంసిస్తున్నారు.మరోవైపు తారక్ కొత్త సినిమాలకు సంబంధించి మరో మూడు రోజుల్లో క్లారిటీ రానుంది.ఎన్టీఆర్ హీరోగా ఇప్పటికే ప్రకటించిన సినిమాల అప్ డేట్లు కూడా తారక్ పుట్టినరోజు సందర్భంగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube