టమోటాలు అమ్ముకుంటున్న బాలీవుడ్ నటుడు  

Actor Javed Hyder Sells Vegetables - Telugu To Make Ends, Bollywood, Corona Crisis, Corona Effect, Lock Down, Tollywood

క‌రోనా ప్రభావం కారణంగా దేశం మొత్తం మూడు నెలల పాటు లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది.ఈ నేపధ్యంలో అన్ని వ్యవస్థలు మూతపడ్డాయి.

 Actor Javed Hyder Sells Vegetables

ఉపాధి రంగం పూర్తిగా స్తంభిచిపోయింది.ఇక సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి.

సినీ రంగంపై ఆధారపడి బ్రతుకుతున్న ఎంతో మంది కార్మికులు ఉపాధి కోల్పోయిన పరిస్థితి.వీరిలో ఎక్కువ ఆదాయం వచ్చిన వారు కొంత వరకు ఈ లాక్ డౌన్ టైంని బాగానే నెట్టుకొని వస్తున్న రోజువారీ కూలి తీసుకునే వారి పరిస్థితి మాత్రం పూర్తిగా దిగజారిపోయింది.

టమోటాలు అమ్ముకుంటున్న బాలీవుడ్ నటుడు-General-Telugu-Telugu Tollywood Photo Image

అలాగే చిన్న చిన్న పాత్రలు చేసే నటులు పరిస్థితి కూడా అలాగే తయారైంది.ఇక చాలా రంగాలలో ప్రజలు ఉపాధి కోల్పోయి బ్రతకడం కోసం మళ్ళీ సొంత ఊళ్ళకి తిరిగి వచ్చేసారు.

కొంత మంది ఉపాధి కోసం ప్రత్యామ్నాయమార్గాలు ఎంచుకుంటున్నారు.

ఇలా వేళలు వేలు జీతం తీసుకునే ఉపాధ్యాయుల నుంచి, సినీ రంగంలో నటులుగా రాణిస్తున్న వారి వరకు చాలా మంది ఉన్నారు.

తాజాగా బాలీవుడ్ న‌టుడు జావేద్ హైద‌ర్ ప‌ని లేక‌పోవ‌డంతో కూర‌గాయ‌లు అమ్ముకుంటున్నాడు.దీనికి సంబంధించిన వీడియోను బిగ్‌బాస్ ఫేమ్ డాలీ బింద్రా టిక్‌టాక్‌లో షేర్ చేసింది.క‌రోనా కార‌ణంగా విధించిన లాక్‌డౌన్ వ‌ల్ల అత‌డికి ఉపాధి క‌రువైంది.దీంతో విధి లేక పొట్ట‌కూటి కోసం కూర‌గాయ‌లు అమ్ముకుంటున్నాడంటూ ఆమె పేర్కొంది.

ఈ వీడియోలో అత‌డు కూర‌గాయ‌ల బండి ముందు టమాటాలు అమ్ముతూ ఓ హిందీ వీడియోకు లిప్‌సింక్ ఇచ్చాడు.ఈ వీడియోకి మిలియ‌న్‌కు పైగా లైకులు వ‌చ్చాయి.

ఇలాంటి క్లిష్ట ప‌రిస్థితిలోనూ మ‌రో మార్గాన్ని ఎంచుకుని జీవించ‌డం గ్రేట్‌, అత‌ని మంచి ప‌ని చేస్తున్నాడు.జీవితంలో ఆశ కోల్పోకూడద‌నడానికి ఇది ఉదాహ‌ర‌ణ అని టిక్‌టాక్ యూజ‌ర్లు కామెంట్ చేస్తున్నారు.

జావేద్ చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలలో నటించి ఇప్పుడిప్పుడే కమెడియన్ గా ఎదుగుతున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Actor Javed Hyder Sells Vegetables Related Telugu News,Photos/Pics,Images..

footer-test