లెజెండ్ విషయంలో జగపతిబాబుకు అన్యాయం జరిగిందట.. ఏమైందంటే?

బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన లెజెండ్ సినిమాతోనే జగపతి బాబు విలన్ పాత్రల్లో నటించడం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.బాలయ్యకు ధీటైన విలన్ పాత్రలో నటించి తన నటనతో జగపతి బాబు మెప్పించారు.

 Jagapati Babu Sensational Comments About Legend Movie, Legend Movie, Jagapathi B-TeluguStop.com

అయితే జగపతి బాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ లెజెండ్ సినిమా విషయంలో తనకు అన్యాయం జరిగిందని షాకింగ్ కామెంట్లు చేశారు.ఫ్యామిలీ హీరో రోల్స్ లో నటించి మంచి పేరు తెచ్చుకున్న జగపతి బాబు సినిమాలు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో ఆ రోల్స్ కు దూరమయ్యారు.

కెరీర్ ఆశించిన విధంగా లేని సమయంలో లెజెండ్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలైందని జగపతి బాబు వెల్లడించారు.రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ తో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు లెజెండ్ విషయంలో అన్యాయం జరిగినట్టు మీకు కూడా తెలుసని అయితే డైరెక్టర్ మాటకు మీరు ఎదురు చెప్పలేకపోయారని జగపతిబాబు అన్నారు.

ఇకపై తన టర్మ్స్ ను బట్టి సినిమాలు చేస్తానని జగపతిబాబు కామెంట్లు చేశారు.

Telugu Akhanda, Balakrishna, Boyapati Srinu, Jagapathi Babu, Jagapathibabu, Jaga

దర్శకుడు కానీ ఫైట్ మాస్టర్లు కానీ తనను కన్విన్స్ చేసినా నచ్చిన సినిమా మాత్రమే చేస్తానని జగపతి బాబు చెప్పుకొచ్చారు.ఒక లయన్ టైగర్ మధ్య ఫైట్ లా ఉంటుందని చెప్పగా కుందేలుతో ఫైట్ చేసిన విధంగా కూడా లేదని జగపతిబాబు అన్నారు.తన పాత్ర బాలయ్య రెండు కొడితే సైలెంట్ అయ్యే పాత్ర అని జగపతిబాబు కామెంట్లు చేశారు.

దర్శకుడు ఎవరైనా కానీ ఇకపై నచ్చితే మాత్రమే సినిమా చేస్తానని జగపతిబాబు చెప్పుకొచ్చారు.

ముక్కుసూటిగా మాట్లాడే జగపతిబాబు లెజెండ్ సినిమా హిట్టైనా తన మనస్సులో ఉన్న అభిప్రాయలను కుండ బద్దలుగొట్టినట్టు చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న అఖండ సినిమాలో సైతం జగపతి బాబు కీలక పాత్ర పోషిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube