ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు కేవలం సినిమాలలో, సీరియల్స్ లోనే కాకుండా మరికొన్ని మార్గాలలో కూడా డబ్బులు సంపాదిస్తారు.చాలా వరకు యాడ్స్ లలో మాత్రమే ఎక్కువగా సంపాదిస్తుంటారు.
ఈమధ్య సోషల్ మీడియా వేదికగా కూడా చాలా మంది సెలబ్రెటీలు వీడియోల ద్వారా పలు రకాల అడ్వర్టైజ్మెంట్ లను ఇస్తూ తెగ డబ్బులు సంపాదిస్తున్నారు.ఇదిలా ఉంటే ఓ సీరియల్ నటి మాత్రం ఎలాంటి డబ్బులు తీసుకోకుండానే చేస్తున్నానని తెలిపింది.
ఇంతకీ ఆ నటి ఎవరో కాదుబుల్లితెర నటి మేఘన.మరో బుల్లితెర నటుడు ఇంద్రనీల్ భార్య.ఎన్నో సీరియల్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఇప్పటికీ పలు సీరియల్స్ లో అమ్మ పాత్రలో నటిస్తుంది.
ఇక ఈమె సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల నుండి ఈమె సోషల్ మీడియాలో కొన్ని ఫుడ్ కి సంబంధించిన ఉత్పత్తుల గురించి ప్రమోట్ చేస్తుంది.
అందులో కస్తూరి ఫుడ్స్, అన్నపూర్ణ పచ్చళ్ళు గురించి తెలుపుతుంది.
వాటిని ఆమె కూడా రుచులు చూసి రివ్యూలు కూడా ఇచ్చింది.దీంతో ఆమె ఇచ్చిన రివ్యూలను బట్టి ఆమె ఫాలోవర్లు కూడా వాటిని కొనడం ప్రారంభించారు.అందులో కొందరికి కుళ్ళిపోయిన పదార్థాలు పంపిస్తున్నారని మేఘన కు తెలిపారు.
అంతేకాకుండా మీరు చెబితేనే మేము కొన్నామంటూ తెలపగా వీటి గురించి స్పందించింది మేఘన.
తనకు పంపిన పదార్థాలు బాగానే ఉన్నాయన .వాటిని తిన్నా తర్వాతనే రివ్యూలు ఇచ్చానని తెలిపింది.కొంతమంది తమకు పదార్థాలు బాగా రాలేవని చెప్పడంతో వాళ్ళు బాధ పడిన విషయాన్ని తనకు తెలిపారని తెలిపింది.ఆమె ఆ సంస్థతో మాట్లాడగా.అందరికీ ఒకే రకమైన ఆహార పదార్థాలను పంపిస్తున్నామని తెలియజేశారని తెలిపింది.దాంతో తను ఇదివరకు తను చెప్పిన రివ్యూల వీడియోలను డిలీట్ చేశానని తెలిపింది.అంతే కాకుండా తను డబ్బులు తీసుకొను అంటూ ఎప్పుడు కూడా అక్కడి నుంచి డబ్బులు తీసుకోలేదు అని కేవలం ఫుడ్ ప్రొడక్ట్స్ గురించి మాత్రమే చెప్పానని తెలిపింది.
దీనివల్ల తన వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదు అని చెప్పుకొచ్చింది మేఘన.