ఆ విషయంలో నన్ను కొందరు అవమానకరంగా చూసారు.. కానీ...

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ సీనియర్ నటుడు “హేమ సుందర్” గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు.అయితే నటుడు హేమ సుందర్ కేవలం చిత్రాలలో మాత్రమే కాకుండా బుల్లి తెరపై కూడా ధారావాహికలలో నటించి ప్రేక్షకులను కూడా బాగానే అలరించాడు.

 Actor Hema Sundar Facing Insults On Remuneration Matters-TeluguStop.com

కాగా తాజాగా హేమ సుందర్ ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో పాల్గొన్న కొన్ని సంఘటనల గురించి పలు ఆసక్తికర విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో భాగంగా తాను సినిమా పరిశ్రమలో నటించేటప్పుడు ఎప్పుడూ కూడా తన పారితోషికం విషయంలో దర్శక నిర్మాతల దగ్గర బెట్టు చేయలేదని అంతేకాకుండా తనకు తాను చేయాల్సిన పాత్ర పై ఆసక్తి ఎక్కువగా ఉంటే ఒక్కోసారి పారితోషకం తక్కువయినా పర్వాలేదనుకుని నటించానని చెప్పుకొచ్చాడు.

 Actor Hema Sundar Facing Insults On Remuneration Matters-ఆ విషయంలో నన్ను కొందరు అవమానకరంగా చూసారు.. కానీ…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే కొందరు దర్శక నిర్మాతలు మాత్రం పారితోషికం విషయంలో కొంత మేర అవమానకరంగా చూసే వాళ్ళని అంతేకాకుండా వాళ్ళు ఆఫర్ చేసిన పారితోషికం కంటే ఎక్కువ అడిగినట్లయితే తన గురించి తప్పుగా అనుకొని లేని పోనివి అల్లుకుంటూ ప్రచారాలు చేసేవాళ్ళని ఆ విషయంలో కొంత మేర బాగా ఇబ్బంది పడ్డానని తెలిపాడు.అంతేకాకుండా తాను ఎప్పుడూ కూడా డబ్బు సంపాదించాలని సినిమా ఇండస్ట్రీకి రాలేదని కేవలం తన నటనా ప్రతిభను నిరూపించుకుని నటుడిగా కొనసాగాలని మాత్రమే ప్రయత్నించానని అంతే తప్ప వేరే ఉద్దేశం లేదని కూడా తెలిపాడు.

Telugu Actor Hema Sunder Facing Insults On Remuneration Matters, Hema Sunder, Remuneration Matters, Telugu Senior Actor, Tollywood-Movie

అయితే ప్రస్తుతం తాను తన కుటుంబ సభ్యులతో కలిసి కర్ణాటకలోని బెంగళూరు పరిసర ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు తెలిపాడు.కానీ సినిమా అవకాశాలు నిమిత్తం అప్పుడప్పుడు చెన్నై, హైదరాబాద్ తదితర నగరాల కి వెళ్ళి వస్తూ ఉంటానని చెప్పుకొచ్చాడు.

#Hema Sunder #Matters #HemaSunder

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు